365తెలుగుడాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్,డిసెంబర్1,2022: కాలానుగు ణంగా జలుబు, జ్వరం, దగ్గు అనేవి వస్తుంటాయి. ముఖ్యంగా చలికాలంలో రోగనిరోధక శక్తి ఉన్నప్పటికీ, అంటువ్యాధులు గానీ, సీజనల్ వ్యాధుల నుంచి గానీ పూర్తిగా తప్పించుకోలేరు.
నెలల వయసున్న చిన్నారుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ శిశువుకు రోజుల వయసు అయితే శీతాకాలంలో మరిన్నిజాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.చలికాలంలో నవజాత శిశువుల్లో ఏదొక అనారోగ్య సమస్యకు తలెత్తుతూ ఉంటుంది.
కాబట్టి శీతాకాలంలో అప్పుడే పుట్టిన చిన్నారుల విషయంలో నిరంతర సంరక్షణ అవసరం. శీతల వాతావరణంలో సూక్ష్మజీవులు, వైరస్‌లు మరింత వేగంగా వృద్ధి చెందుతాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న శిశువులకు వ్యాధులు సులభంగా సోకడానికి ఆవకాశం ఉంటుంది.
పసిపిల్లలు పెద్దవారి కంటే త్వరగా వేడిని కోల్పోతారు. ముఖ్యంగా రోజుల వయసు ఉన్న శిశువులైతే చలి వాతావరణాన్ని అస్సలు తట్టుకోలేరు. పిల్లలు వణుకుతున్నప్పుడు వేడిని పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉండలేరు.
వారు చల్లగా ఉన్నప్పుడు తిరిగి వేడెక్కడానికి అవసరమైన శరీర కొవ్వు కూడా ఉండదు. అదే పెద్దవాళ్ళ లో అయితే తిరిగి వేడిని పెంచడానికి శరీర కొవ్వు ఉపయోగపడుతుందని పిల్లల వైద్య నిపుణులు చెబుతున్నారు.
నవజాత శిశువుల కోసం శీతాకాల సంరక్షణ చిట్కాలు
.చలికాలంలో లెగ్గింగ్‌లు, బాడీసూట్ వంటివి చిన్నారులకు వేయాలి.మీ బిడ్డ వెచ్చగా ఉండటానికి మీరు ప్యాంటుమరొక పొరను, పొడవాటి స్లీవ్ షర్టులను వేయవచ్చు.
.చేతులు, కాళ్ళు వెచ్చగా ఉంచడానికి జాకెట్, టోపీ, చేతి తొడుగులు,వెచ్చని బూట్లు తొడగాలి.
.కాటన్, మస్లిన్ వంటి శ్వాసక్రియకు అనువుగా ఉండే బట్టలను ఎంచుకోండి, తద్వారా మీరు అవసరమైనప్పుడు దుస్తులను వేయడం లేదా తీయడం చేయవచ్చు.
లోపలి ఉష్ణోగ్రత ఎంత ఉండాలి..?
.చలికాలంలో అధిక ఉష్ణోగ్రతలు కూడా సమస్యగా మారవచ్చు. సహజంగానే చలికాలంలో హీట్ తక్కువగా ఉంటుంది.
.ఒకవేళ గాలిలో తేమ లేకపోతే శిశువు సున్నితమైన చర్మం పొడిగా మారుతుంది.
.దీన్ని నివారించడానికి, ఇంట్లో ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచాలి.
.ఇంటిని, శిశువు ను ఉంచే గదిని సౌకర్యవంతంగా వెచ్చగా ఉంచడం వలన మీ శిశువును సురక్షితంగా ఉంచడానికి వీలవుతుంది.
.ఒకవేళ ఎయిర్ డ్రైయ్యర్స్ వాడడం వల్ల గదిలో ఆవిరి గాలి పెరిగి పొడిగా మారుతుంది.
.దీంతో తేమ స్థాయిలు తగ్గి గదిలోఉక్కపోత మొదలవుతుంది.
.కాబట్టి తగిన వాతావరణం ఉండేలా చూసుకోవాలి.
మాయిశ్చరైజ్
.శిశువు చర్మం చాలా సున్నితంగా ఉంటుంది.
.తద్వారా శీతాకాలపు కఠినమైన వాతావరణం చర్మాన్ని పొడిగా చేస్తుంది. శి
.శువు మృదువైన సున్నితమైన చర్మాన్ని సంరక్షించడానికి స్కిన్ మాయిశ్చరైజర్ లను వినియోగించాలి.
టీకా షెడ్యూల్
.శీతాకాలంలో నవజాత శిశువు అంటువ్యాధులకు ఎక్కువ అవకాశం ఉంటుంది.
.బిడ్డకు సరైన సమయంలో టీకాలు వేయడం చాలా ముఖ్యం.
.సరైన షెడ్యూల్‌ను అనుసరించడానికి ఎప్పటికప్పుడు వైద్యుడిని సంప్రదించాలి.
తల్లిపాలు..
.తల్లి పాలలో యాంటీబాడీలు, పోషకాలు ఉంటాయి, ఇవి శిశువు రోగనిరోధక శక్తిని పెంచడానికి, సాధారణ వ్యాధుల నుంచి వారిని రక్షించడంలో సహాయపడతాయి.
.తల్లిపాలు శిశువు ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తుంది.
.తల్లిపాలు ఇస్తున్నప్పుడు, తల్లి శరీర వెచ్చదనం బిడ్డకు విశ్రాంతినిస్తుంది.
తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలి..
.బిడ్డను తాకేటప్పుడు పరిశుభ్రంగా ఉండాలి.
.బిడ్డను ఎత్తుకునే ప్రతిసారీ మీ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. null
ఇవి కూడా చదవండి..
వాహనదారులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గనున్న పెట్రోల్,డీజిల్ ధరలు.. ఎందుకంటే..?
కెఎస్.జవహర్ రెడ్డి ప్రొఫైల్..
శాంసంగ్ గెలాక్సీ A14, M54 5G, S23 సిరీస్ లాంచ్‌కు ముందే ఫీచర్స్ లీక్
డిసెంబర్10న డా.జి.సమరంతో దాంపత్య వికాసంపై నేషనల్ లెవల్ ట్రైనింగ్ క్యాంప్
ఇండియాలో మొట్టమొదటి అంతర్జాతీయ బౌద్ధ విశ్వవిద్యాలయం.. ఎక్కడంటే..?
ఫ్రీగా హిందూ పురాణాలకు సంబంధించిన పీడీఎఫ్ బుక్స్..
సమీర్ శర్మ కు సీఎం జగన్ కీలక బాధ్యతలు
వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం..విచారణ తెలంగాణకు బదిలీ
పిల్లల్లో మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..?
అమ్మకానికి మినరల్ వాటర్ కంపెనీ బిస్లరీ..కారణం ఇదే..
డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిస్తే..మళ్లీ డ్రైవింగ్ టెస్టు తప్పనిసరి..