365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 10,2025: వేంకటేశ్వరస్వామివారి దివ్య కృపాకటాక్షంతో, భక్తులకు మా నిరంతర సేవను కొనసాగిస్తూ, తిరుమలలో వేంకటేశ్వర అన్నప్రసాద ట్రస్ట్ కొరకు అత్యాధునిక, ప్రపంచ స్థాయి వంటశాలను నిర్మించనున్నట్లు ప్రకటించడానికి మేము గర్వంగా భావిస్తున్నాము.
ఈ పుణ్య కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానములు (TTD)తో భాగస్వామ్యంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి మద్దతుతో చేపట్టబడుతోంది. ఈ సరికొత్త వంటశాల అత్యాధునిక ఆటోమేషన్ సౌకర్యాలతో, ప్రతిరోజూ 2,00,000 (రెండు లక్షల) కంటే ఎక్కువ పవిత్ర భోజనాలను తయారు చేసి అందించే సామర్థ్యం కలిగి ఉంటుంది – ప్రతి భక్తునికి భక్తి, పరిశుభ్రత, ప్రేమతో కూడిన పౌష్టికాహార అన్నప్రసాదం అందేలా చేస్తుంది.

తిరుమల – విశ్వాసం, కరుణ, నిస్వార్థ సేవకు శాశ్వత ప్రతీక. ఈ కార్యక్రమం ద్వారా, TTD ఆలయాలన్నింటికీ అన్నసేవను విస్తరించాలనే ఎన్. చంద్రబాబు నాయుడు ఉన్నత దార్శనికతకు మా సహకారం అందించడం గౌరవంగా భావిస్తున్నాము.
TTD,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారి మార్గదర్శకత్వం, సహకారానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. వేంకటేశ్వరస్వామికి సేవ చేయడం, ‘ఏ భక్తుడూ ఆకలితో ఉండకూడదు’ అనే తిరుమల దివ్య సంకల్పంలో భాగమవడం మాకు లభించిన అపూర్వ భాగ్యం.
ముకేష్ అంబానీ కేరళలోని త్రిస్సూర్ జిల్లా, గురువాయూర్లోని గురువాయూర్ కృష్ణ దేవాలయాన్ని కూడా దర్శించారు. ఆయన ఆ ఆలయానికి ₹15 కోట్ల విరాళం అందించారు.
