365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 7, 2024:మార్చి 8వ తేదీని ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. మహిళా హక్కుల కార్యకర్త క్లారా జెట్కిన్ 1910లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రారంభించారు. మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ ,స్విట్జర్లాండ్‌లో జరుపుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పర్పుల్ కలర్‌తో గుర్తిస్తారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి ఈ రంగుకి ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందాం.
మహిళా దినోత్సవం 2024: పర్పుల్ కలర్‌తో మహిళా దినోత్సవానికి సంబంధం ఏమిటి?
పింక్ కలర్ అమ్మాయిలకు సంబంధించిన విశేషాలను వివరించడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. నీలం రంగును అబ్బాయిలకు సంబంధించిన విశేషాలను తెలియజేయడానికి ఉపయోగిస్తారు. మహిళా దినోత్సవం రోజున పర్పుల్ రంగును ప్రత్యేకంగా ధరిస్తారు, ఇది న్యాయానికి చిహ్నం. పర్పుల్ రంగును ప్రత్యేకంగా ధరిస్తారు. ఎందుకొ మీకు తెలుసా..? ఊదా రంగు మాత్రమే కాదు, మరో రెండు రంగులు కూడా స్త్రీలు ఆరోజున ఎక్కువగా ధరిస్తారు. అవేంటంటే..?
ఊదా రంగు..
ఊదా రంగు న్యాయం, గౌరవానికి చిహ్నం. మహిళా దినోత్సవం రోజున ఊదా రంగు దుస్తులు ధరించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు సంఘీభావాన్ని చూపుతుంది.
ఆకుపచ్చ..
ఈ ప్రత్యేకమైన రోజును జరుపుకోవడానికి సంబంధించిన ఆకుపచ్చ రంగు సానుకూలతకు ఆశకు చిహ్నం. అంతేకాదు వైద్య రంగంలో ఎక్కువగా ఈ రంగును వాడుతుంటారు. ఆకుపచ్చ రంగు సమానత్వం, బలాన్ని సూచించే రంగు. వాస్తవానికి మహిళల శక్తివంతమైన వ్యక్తిత్వంతో ముడిపడి ఉంటుంది గ్రీన్ కలర్.
తెలుపు రంగు స్వచ్ఛత, శాంతిని సూచిస్తుంది.
తెలుపు రంగు స్వచ్ఛతకు చిహ్నంగా పరిగణిస్తారు. తెలుపు రంగు విజయవంతమైన ప్రారంభానికి సూచిక. అంతేకాకుండా, ఈ రంగు శాంతి ,సంకల్పాన్ని కూడా చూపుతుంది. ప్రపంచవ్యాప్తంగా శాంతి,సామరస్యాన్ని కొనసాగించడంలో మహిళల పాత్ర చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు కాబట్టి ఈ రంగు కూడా మహిళల దినోత్సవంలో ఒక ప్రత్యేక భాగం అయ్యింది.
ఎవరు ప్రారంభించారు..?
క్లారా జెట్కిన్ అనే మహిళా హక్కుల కార్యకర్త 1910లో అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి పునాది వేశారు. డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లో జరిగిన అంతర్జాతీయ శ్రామిక మహిళల సదస్సులో ఆమె ఈ విషయాన్ని ప్రస్తావించారు. కోపెన్‌హాగన్‌లో జరిగిన సదస్సులో 17 దేశాల నుంచి 100 మంది మహిళలు పాల్గొన్నారు.
క్లారా జెట్కిన్ చేసిన సూచనను వారు అంగీకరించారు. ఆ తర్వాత 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్‌లలో మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ రోజున సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ వంటి రంగాలలో విశేష కృషి చేసిన మహిళలను సత్కరిస్తారు.
ఇది కూడా చదవండి.. ఏఐ రహస్యాలను దొంగిలించిన మాజీ గూగుల్ ఇంజనీర్ అరెస్ట్..