365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, మార్చి10, 2023: గత 35 ఏళ్లుగా గ్రోసరీ రీటైల్ వ్యాపార సంస్థగా పేరొందిన రత్నదీప్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8, 9 తేదీలలో రెండు ప్రత్యేక కార్యక్రమాల్లో నిర్వహించారు.
మహిళా దినోత్సవం థీమ్ ను ప్రోత్సహించడం, రత్నదీప్ విలువలు, లింగ సమానత్వం పట్ల నిబద్ధతపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమాల లక్ష్యం. సికింద్రాబాద్ విక్రంపురిలో గల కంపెనీ కార్పొరేట్ కార్యాలయంలో రత్నదీప్ ప్రతినిధులు ప్యానెల్ డిస్కషన్ నిర్వహించారు.
మానసిక ఆరోగ్యం, పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నిరోధం, ఉద్యోగం-కుటుంబ జీవనం మధ్య సమన్వయం, పిల్లల పెంపకం లాంటి వివిధ అంశాలపై జరిగిన ఈ చర్చలో రత్నదీప్ మహిళా ఉద్యోగులు, వైద్యం, విద్య, ప్రభుత్వం సహా వివిధ రంగాలకు చెందిన ప్రత్యేక అతిథులు పాల్గొన్నారు.
ఈ చర్చను రత్నదీప్ బృందం అంతర్గతంగా నిర్వహించింది. పిల్లల పెంపకంలో లింగ సమానత్వం, తదుపరి తరాన్ని పెంచే బాధ్యత, నిష్పాక్షికతకు ఉండే ప్రాధాన్యం లాంటి అంశాలను కవర్ చేసింది.
మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించేందుకు అంతర్గతంగా పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నిరోధం కోసం ఒక బృందాన్ని ఏర్పాటుచేసి, ఉద్యోగులకు అవగాహన కల్పించేందుకు రత్నదీప్ తగు చర్యలు తీసుకుంది.
ఈ సందర్భంగా రత్నదీప్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ అగర్వాల్ మాట్లాడుతూ, “స్త్రీత్వం అనేది బలానికి, స్థితిస్థాపకతకు, సమానత్వానికి మూలం. సమానత్వాన్ని స్వీకరించండి అనే థీమ్‌తో ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం మాకు గర్వంగా ఉంది”.
“మా ఉద్యోగులు, వినియోగదారులందరికీ సురక్షితమైన, సమానమైన పనిప్రాంతాన్ని రూపొందించడంలో మాకున్న నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాము” అని చెప్పారు.
మహిళా దినోత్సవం సందర్భంగా చర్చా కార్యక్రమం నిర్వహించిన తర్వాత, రత్నదీప్ నల్లగండ్ల స్టోర్ లో ఎంగేజ్ మెంట్ డిస్కషన్ నిర్వహించి, ఈ వేడుకలో పాల్గొనాల్సిందిగా వినియోగదారులను ఆహ్వానించారు.
ఈ చర్చలో ప్రముఖ మామ్-బ్లాగర్ నమ్రత ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఎంసీ ఇషా చర్చను మోడరేట్ చేశారు. ‘మాతృత్వం, సమానత్వం’ అనే అంశాలపై ప్రధానంగా చర్చించారు. రత్నదీప్ తన ఉద్యోగులకు కూడా ఉత్తమ విలువలు, శిక్షణను అందించాలని నమ్ముతుంది.
వయసు, లింగం, జాతి, ఇంకా ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించే విలువలు ఉన్న రత్నదీప్ ఉద్యోగుల్లో, దాదాపు 68 శాతం మంది మహిళలే.
ఇందులో పూర్తిగా మహిళలే నిర్వహిస్తున్న దుకాణాలున్నాయి. ఆహారం, కిరాణా రీటైల్ రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రత్నదీప్.. దక్షిణ భారతదేశంలోని ప్రతి ఇంట్లో అత్యంత విశ్వసనీయమైన పేరు రత్నదీప్.