Sun. Dec 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మార్చి5, 2024: భారతదేశంలోని అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ లలో ఒకటైన వండర్ లా హాలిడేస్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించు కుని మహిళలందరికీ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. మహిళల కోసం ప్రత్యేకమైన వినోదం, సాహసాలను అందించటం కోసం  వండర్ లా సిద్ధంగా ఉంది. ఒన్ + ఒన్ ఆఫర్ తో ప్రవేశ టిక్కెట్‌ల ధర ను రూ. 1609/- (GSTతో సహా) గా నిర్ణయించారు. మహిళలు తమ గర్ల్ గ్యాంగ్‌తో సరదాగా, ఉల్లాసంగా గడిపేందుకు ఈ ప్రత్యేకమైన రోజు కోసం ప్లాన్ చేసుకోవచ్చు. హైదరాబాద్ పార్క్‌లో ప్రపంచ స్థాయి రైడ్‌లు మరియు ఆకర్షణలను ఆస్వాదించవచ్చు.

ఈ ఆఫర్ ప్రత్యేకంగా ఆన్‌లైన్ బుకింగ్‌పై మాత్రమే అందుబాటులో ఉంది మరియు 8 మార్చి 2024న అమ్మకానికి అందుబాటులో ఉండదు. మహిళలకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని నిర్ధారించడానికి, మార్చి 8న 10 ఏళ్లు పైబడిన పురుష సందర్శకులను పార్క్ లోపలకు అనుమతించరు. మార్చి 8న సందర్శన కోసం ఇప్పటికే పురుషులు బుక్ చేసుకున్న యెడల ఆ టిక్కెట్ రద్దు చేయబడుతుంది.

ప్రయాణ సౌలభ్యం కోసం, వండర్ లా పెయిడ్ పిక్ అప్ మరియు డ్రాప్ సేవను ఏర్పాటు చేసింది, ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు +91 91000 60336కు కాల్ చేయడం ద్వారా ఈ సేవలను పొందవచ్చు. ఈ సేవలు కేవలం రూ. 250/- కు లభ్యమవుతాయి. అలాగే, హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల నుండి వండర్ లా హైదరాబాద్‌కు TSRTC బస్సులు తరచుగా నడుస్తాయి, ఇబ్రహీంపట్నం&రావిరాల వైపు వెళ్లే ఏదైనా బస్సు ఎక్కి వండర్ లా బస్ స్టాప్ దగ్గర దిగవచ్చు.

ఈ కార్యక్రమం గురించి వండర్ లా హాలిడేస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అరుణ్ కె చిట్టిలప్పిల్లి మాట్లాడుతూ, “అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వేడుక జరుపుకోవడమంటే గతాన్ని గౌరవించటానికి, వర్తమానాన్ని జరుపుకోవడానికి మరియు మహిళలందరికీ సమానత్వం యొక్క భవిష్యత్తును ఊహించే తరుణం. వండర్ లా వద్ద ప్రతి మహిళకూ మరపురాని అనుభూతిని అందించడం, సంతోషకరమైన క్షణాలు, ప్రియమైనవారితో అనుబంధాన్ని పెంపొందించడం మా లక్ష్యం. 

మధురమైన జ్ఞాపకాలను సృష్టించే దిశగా మా ప్రయత్నం ఈ ప్రత్యేకమైన ఆఫర్, అందరికీ భద్రత మరియు సౌకర్యాన్ని కల్పిస్తున్నామనే భరోసా అందిస్తున్నాము. అమ్యూజ్మెంట్ పార్క్స్ థ్రిల్ ను ఆస్వాదించేందుకు మరింత మంది మహిళలకు ఈ ఆఫర్ స్ఫూర్తి కలిగిస్తుందని మరియు తమ ప్రత్యేక రోజును మాతో కలిసి వేడుక జరుపుకునేందుకు తోడ్పడుతుందని నమ్ముతున్నాము ” అని అన్నారు. 

మహిళలు తమ ప్రియమైన వారితో కలిసి తమ ప్రత్యేక దినోత్సవాన్ని వేడుక జరుపుకోవడానికి ఒక గొప్ప అవకాశం గా వండర్ లా హాలిడేస్‌లో ఉమెన్స్ డే ఆఫర్ అందుబాటులో ఉంటుంది. మీ టిక్కెట్లను ఇప్పుడే బుక్ చేసుకోండి, వండర్ లా వద్ద మరపురాని వినోదం, సాహసం మరియు ఉత్సాహం కోసం సిద్ధంగా ఉండండి!

 ఆఫర్‌పై మరిన్ని వివరాల కోసం, https://www.wonderla.com/offers/buy-one-get-one-free-on-womens-day-at-wonderla.htmlని చూడండి లేదా హైదరాబాద్ పార్క్ – 0841  4676333, +91 91000 63636 వద్ద  సంప్రదించవచ్చు.

error: Content is protected !!