Tue. Dec 17th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,ఏప్రిల్ 13,2022: భారతదేశం లోని ప్రముఖ అమ్యూజ్‌మెంట్ పార్క్ చైన్,వండర్లా హాలిడేస్ లిమిటెడ్,తన హైదరాబాద్ పార్క్ 6వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఏప్రిల్‌లో పుట్టినరోజు జరుపుకునే వారు తమ స్నేహితులు,కుటుంబ సభ్యులతో కలిసి వండర్‌లా హైదరాబాద్‌ను సందర్శించినప్పుడు ‘బై ఒన్ గెట్ ఒన్’ ఆఫర్‌ను పొందవ చ్చు. ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకు మాత్రమే అమలు ఉంటుంది.

ఈ సందర్భంగా వండర్‌లా హాలిడేస్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అరుణ్‌ చిట్టిలపిల్లి మాట్లాడుతూ, ‘హైదరాబాద్‌ పార్క్‌ ప్రారంభించి ఈ ఏప్రిల్కు ఆరేళ్లయింది. అందుకే ఈ ఏప్రిల్‌ నెలకు మన హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఇది 6 ఏళ్ల అద్భుతమైన సాహసం. ఏళ్ల తరబడి మద్దతు ఇస్తున్న మా వినియోగదారులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాను’’ అని తెలిపారు.

వండర్లా హైదరాబాద్ పార్క్ 2016లో ఏర్పాటు చేశారు. ల్యాండ్, వాటర్, కిడ్స్ , హై థ్రిల్ రైడ్‌లతో సహా 46 రైడ్‌లను కలిగి ఉంది. ఈ పార్క్ వివిధ ఇండోర్ షోలు,ఇతర ఆకర్షణలకు నిలయంగా ఉంది.

మార్గదర్శకాలు,ఉత్తమ అభ్యాసాలను అనుసరించి, ఆన్‌లైన్ పోర్టల్
https://apps.wonderla.co.in/ay   ద్వారా ముందుగానే వారి ఎంట్రీ టిక్కెట్‌లను బుక్ చేసుకోమని వండర్లా సందర్శకులను ప్రోత్సహిస్తుంది లేదా వినియోగదారులు తాము పార్కుకు వచ్చినప్పుడు పార్క్ కౌంటర్‌ల నుంచి టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు.

error: Content is protected !!