365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఏప్రిల్ 15,2025: వేసవి మజాను మరింత జోష్‌తో ఆస్వాదించాలనుకునే వారికి శుభవార్త! దేశంలోని ప్రముఖ అమెజ్‌మెంట్ పార్క్‌ల నిర్వాహక సంస్థ వండర్లా హాలిడేస్ లిమిటెడ్, తన 25వ వార్షికోత్సవం సందర్భంగా ‘మైండ్ బ్లోయింగ్ సమ్మర్’ పేరుతో వినూత్న కార్యక్రమాలు ప్రారంభించింది.
హైదరాబాద్‌లోని వండర్లా పార్క్‌లో ప్రత్యేక నైట్ పార్క్, పూల్‌సైడ్ డీజే, మామిడి రుచులతో ఆమ్రస్ ఫెస్టివల్, జుంబా సెషన్లు వంటి వినోద కార్యక్రమాలు సందర్శకులను అలరిస్తున్నాయి.

ఈ వేసవిలో ప్రత్యేక ఆకర్షణగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో రూపొందించిన VR మేజిక్ ఎక్స్‌పీరియన్స్ – హైపర్వర్స్, జి-ఫోర్స్ వంటి థ్రిల్లింగ్ రైడ్స్ అందుబాటులోకి వచ్చాయి. పిల్లలు, కుటుంబాలు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్లకు అనేక రకాల డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రత్యేక ఆఫర్లు:
- మైండ్ బ్లోయింగ్ సమ్మర్ ఆఫర్: ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా టిక్కెట్లపై 20% తగ్గింపు.
- సీనియర్ సిటిజన్స్‌కి: టిక్కెట్లపై 50% తగ్గింపు.
- పిల్లలకి (85 సెంటీమీటర్ల నుంచి 140 సెంటీమీటర్ల ఎత్తు): ఫ్లాట్ 20% తగ్గింపు.
- 10–12 తరగతుల విద్యార్థులకు: హాల్ టికెట్ ఆఫర్ ద్వారా 35% తగ్గింపు.
- కాలేజ్ విద్యార్థులకు: కాలేజ్ ఐడీ చూపించడం ద్వారా 25% తగ్గింపు.
పూల్‌సైడ్ DJలు, ఫన్ గేమ్స్, గ్రూప్ యాక్టివిటీలతో సందడి చేస్తోంది వండర్లా. భోజన ప్రియుల కోసం మామిడితో తయారైన మోమోస్, ఆమ్రస్ పూరీ, మామిడి లస్సీ, మామిడి షేక్‌లు, జిలేబీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఈ సందర్భంగా వండర్లా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె. చిట్టిలప్పిళ్ళి మాట్లాడుతూ, “ప్రపంచ స్థాయి భద్రతా ప్రమాణాలతో, వినూత్న ఆకర్షణలతో ఈ వేసవిలో ప్రతి సందర్శకునికి మధురమైన అనుభూతిని అందించాలన్నదే మా లక్ష్యం,” అని తెలిపారు.

వండర్లా వేడుకలు హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, కొచ్చి, భువనేశ్వర్ పార్కుల్లోనూ కొనసాగనున్నాయి.
బుకింగ్ వివరాలు: https://bookings.wonderla.com/
సంప్రదించవలసిన నంబర్లు: 08414676333 / +91 91000 63636