Thu. Nov 7th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 20,2023: భారతదేశపు అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ చెయిన్‌గా ఉన్న వండర్‌లా హాలిడేస్ లిమిటెడ్ ఇప్పుడు వండర్‌లా హైదరాబాద్‌లో రెయిన్‌బో లూప్స్ అండ్ డ్రాప్ లూప్ అనే రెండు థ్రిల్లింగ్ వాటర్ రైడ్స్ ను ప్రారంభించింది.

వండర్‌లా హాలిడేస్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె చిట్టిలపిల్లి అండ్ పార్క్ హెడ్ మధు సూధన్.జి సమక్షంలో ప్రముఖ తెలుగు సినీనటి లావణ్య త్రిపాఠీ చేతుల మీదుగా బుధవారం ఈ రైడ్స్ ను ప్రారంభించారు.

టర్కీ నుంచి దిగుమతి అయిన ఈ రెండు వాటర్ రైడ్స్ ను పరిచయం చేయడం ద్వారా, సందర్శకులకు మంచి అనుభవాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నామనే తమ అచంచల నిబద్ధతను వండర్‌లా మరోసారి ప్రదర్శించింది.

“రెయిన్‌బో లూప్స్” అనే పేరు వెనుక ఉన్న ఆకర్షణీయ కథనం ద్వారా, ఆ పేరు వెనుక ఉన్న చమత్కారమైన మూల కథను తెలుసుకోవచ్చు. ఈ వాటర్ వండర్‌కి తగిన పేరు సూచించాల్సిందిగా వండర్‌లా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఒక పోటీని తీసుకొచ్చింది.

దీనికి గొప్ప ప్రతిస్పందన లభించింది. పోటీలో పాల్గొన్నవారు దాదాపుగా 357 విభిన్న పేర్లు సూచించారు. ఈ విస్తృతమైన ఆలోచనల నుంచి రెండు విలక్షణమైన పేర్లను లోతైన మూల్యాంకనం కోసం ఎంచుకున్నారు. చివరకు, “రెయిన్‌బో లూప్స్”ని పేరు పెట్టారు.

ఈ కార్యక్రమంలో భాగంగా, వండర్‌లా హాలిడేస్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె. చిట్టిలపిల్లి మాట్లాడుతూ.. “హైదరాబాద్ పార్క్‌లో రెయిన్‌బో లూప్స్ అండ్ డ్రాప్ లూప్ అనే రెండు కొత్త వాటర్ రైడ్లు ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

సందర్శకులకు వినోదం, ఉత్సాహంతో పాటు ఒక మరపురాని అనుభూతిని అందించేలా ఈ రైడ్లను రూపొందించినట్లు ఆయన నొక్కి చెప్పారు.

వినోదపు సరిహద్దులను విస్తరించడంతో పాటు ప్రతిఒక్కరూ సంపూర్ణంగా ఆనందించే ఒక పర్యావరణాన్ని సృష్టించడమనే వండర్‌లా నిబద్ధతను అరుణ్ కె. చిట్టిలపిల్లి ఈ సందర్భంగా ప్రముఖంగా పేర్కొన్నారు. https://bookings.wonderla.com

“మా పార్క్‌లోకి సందర్శకులను స్వాగతించడంతో పాటు మా కొత్త రైడ్లను ఆస్వాదించే సమయంలో వారి ముఖాల్లో చిరునవ్వులు చూడడాన్ని మేము థ్రిల్లింగ్‌గా భావిస్తాము” అని ఆయన అన్నారు.

కార్యక్రమంలో భాగంగా, లావణ్య త్రిపాఠీ మాట్లాడుతూ.. “రెయిన్‌బో లూప్స్” అండ్ “డ్రాప్ లూప్”లను ఆవిష్కరించడాన్ని తాను గర్వంగా భావిస్తున్నట్లు చెప్పారు.

పార్క్ పట్ల ప్రజలు ప్రదర్శించే ఇష్టం, కుటుంబాల్లో పార్క్‌కి ఉన్న ఆదరణ గురించి రెండు దశాబ్దాలుగా ప్రతిఒక్కరిలో పార్క్ సృష్టించిన శాశ్వత జ్ఞాపకాలను ఆమె ప్రత్యేకంగా పేర్కొన్నారు.

వాటర్ గేమ్స్ ఔత్సాహికురాలిగా, సాహసాల కోసం అన్వేషించే వ్యక్తిగా, తన దృష్టిలో ఈ కొత్త రైడ్లు వినోదానికి సిసలైన కేంద్రంగా ఉంటాయని ఆమె అన్నారు.

“ఈ రైడ్లు అందించే ఉత్సాహం, ఆహ్లాదంతో సందర్శకులు పరవశించిపోతారనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు” అని ఆమె అన్నారు.

డ్రాప్ లూప్..

డ్రాప్ లూప్ అనేది ఉరకలెత్తించే ఉత్సాహం రేకెత్తించే ఒక రైడ్‌గా ఉంటుంది. ఆకాశాన్ని తాకుతోందా అన్నట్లుగా, 45-అడుగుల ఎత్తు నుంచి ఈ రైడ్ మొదలై, 200-అడుగుల పొడవైన ఒక అపారదర్శక ట్యూబ్‌ వ్యాప్తంగా సాగుతూ, 82-అడుగుల రనౌట్‌తో ముగుస్తుంది.

శరీరం జారుతూ వెళ్లే ఈ రైడ్ అనేది మీరు ఒక ట్రాప్‌డోర్ మీద నిలబడడం ద్వారా మొదలవుతుంది. ఆ ట్రాప్‌డోర్ తెరచుకోగానే, గుండె గుబేలుమనిపించే లూప్‌లు, వంపుల ద్వారా మీరు వేగంగా జారుకుంటూ వెళ్తారు.

మీ ప్రయాణానికి వాటర్ ఫీచర్లు కూడా తోడు కావడంతో, మీరు ఉత్సాహపు అదనపు ఎత్తుని చవిచూస్తారు. మరపురాని సాహసం చేయడం ద్వారా, థ్రిల్‌ని అనుభవించా లనుకునేవారు ఈ రైడ్‌ని తప్పక ప్రయత్నించాలి.

రెయిన్‌బో లూప్స్..

రెయిన్‌బో లూప్స్ అనేది వండర్‌లా హైదరాబాద్ పార్క్‌లోని ఒక అత్యద్భుతమైన సరికొత్త వాటర్ రైడ్. ఇది సందర్శకులను ఒక గొప్ప స్లయిడింగ్ మీద థ్రిల్లింగ్ ప్రయాణంలోకి తీసుకువెళ్తుంది.

ఈ ట్యూబ్ స్లయిడ్ అనేది నేల మీద నుంచి 45 అడుగుల ఎత్తులో ప్రారంభమై, ఆతర్వాత, 112 అడుగుల పొడవైన ఒక ట్యూబ్‌ లోపల సాగుతుంది. ఈ ప్రయాణం వ్యాప్తంగా సూర్యకాంతి మీ మీద ప్రకాశించడం వల్ల మీరు ఒక ఇంద్రధనస్సులో ఉన్నట్లుగా అనిపిస్తుంది.

కాబట్టి, ఈ అనుభవం చాలా గొప్పగా ఉంటుంది. ఆ తర్వాత, 105 అడుగుల పొడవుతో ఉండే ఆరు లైన్లలో ఒక దానిలో మీరు వేగంగా ముందుకు వెళ్తారు. ఇదొక ఉద్వేగభరిత పోటీలా ఉంటుంది.

మీరు 100 అడుగుల నిటారుగా ఉండే ఒక స్లయిడర్‌లో జారుకుంటూ వెళ్తారు. ఈ అనుభవం గొప్ప ఉద్వేగభరితంగా ఉంటుంది. రెయిన్‌బో లూప్స్ అనేది సంపూర్ణమైన ఆనందం, ఉద్వేగం, సాహసంతో నిండి ఉంటుంది. మీకు ఎప్పటికీ గుర్తుండే అనుభవాన్ని ఈ రైడ్‌ అందిస్తుంది.

https://bookings.wonderla.com అనే ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా, సందర్శకులు వారి ప్రవేశ టికెట్లు బుక్ చేసుకోవడాన్ని వండర్‌లా ప్రోత్సహిస్తుంది. వీలుకాని పక్షంలో, వినియోగదారులు వారి సందర్శన రోజున నేరుగా పార్క్ కౌంటర్ల నుంచి కూడా టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. మరిన్ని వివరాల కోసం, 0841 4676333, +91 91000 63636 అనే నంబర్లను సంప్రదించండి.

error: Content is protected !!