365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్,సెప్టెంబర్24, 2021: భారతదేశంలోని అగ్రగామి అమ్యూజ్‌మెంట్ పార్క్ శ్రేణి వండర్‌లా హాలిడేస్ లిమిటెడ్ కుమార్తెల దినోత్సవానికి ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.సెప్టెంబరు 26న కుమార్తెల దినోత్సవాన్ని పురస్కరించుకుని కొచ్చి, బెంగళూరు,హైదరాబాద్‌లలోని వండర్‌లా పార్క్‌కు ఫ్రీ ఎంట్రీకి అవకాశం కల్పిస్తుంది.
తమ తల్లిదండ్రులతో పాటు కుమార్తెకు ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నారు. కరోనా నిబంధనలు అనుసరించి వండర్‌లా తన ఎంట్రీ టిక్కెట్లను ఆన్‌లైన్ పోర్టల్ bookings.wonderla.com ద్వారా ముందే రిజర్వు చేసుకోవచ్చు. బుకింగ్ ,వివరాలకు వండర్‌లా వెబ్‌సైట్‌ను https://www.wonderla.com/
వీక్షించండి లేదా కాల్ చేయండి:హైదరాబాద్ – 040 23490300, 040 23490333