365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, మార్చి 9, 2025: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించు కుని తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారితను మరింతగా బలోపేతం చేయడానికి అనేక కొత్త పథకాలను అమలు చేయనుంది. ఈ మేరకు మహిళలు అన్ని రంగాల్లో సముచిత స్థానం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ డా. హరీష్ తెలిపారు.

నాంపల్లి, చాపెల్ రోడ్‌లోని తెలంగాణ మీడియా అకాడమీ భవనంలో ఆదివారం మహిళా జర్నలిస్టుల కోసం నిర్వహించిన “ఆన్లైన్ జర్నలిజం – మహిళా జర్నలిస్టుల సాధికారిత” శిక్షణా తరగతులకు ఆయన గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టుల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని, మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన జర్నలిస్టుల అగ్రిడిటేషన్ అధ్యయన కమిటీ మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక సిఫారసులు చేసినట్లు తెలిపారు. దీని ద్వారా మహిళా జర్నలిస్టులకు తగిన ప్రాతినిధ్యం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మహిళా జర్నలిస్టులు జర్నలిజం మాత్రమే కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని సూచిస్తూ, విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త మేరీ క్యూరీ రెండుసార్లు నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి మహిళగా గుర్తింపు పొందినట్టు గుర్తుచేశారు.

ఈ శిక్షణా తరగతులు మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగాయి.ఈ కార్యక్రమంలో ప్రముఖ నిపుణులు వివిధ అంశాలపై ఉపన్యాసాలు అందించారు..
🔹 “ఆన్లైన్ జర్నలిజం మెళుకువలు – సోషల్ మీడియా ప్రణాళిక” – ఐఎస్‌బి డేటా సైన్స్ కళాశాల ప్రొఫెసర్ మధు విశ్వనాథం
🔹 “వార్తల మూలం – విషయ పరిజ్ఞానం” – కృత్రిమ మేధస్సు నిపుణుడు రాకేశ్ దుబ్బుడు
🔹 “ఆన్లైన్ జర్నలిజం, నావిగేషన్, విశ్వసనీయత, కృత్రిమ మేధస్సు” – హైదరాబాద్ యూనివర్సిటీ సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మాధవి రవి కుమార్
🔹 “ఫేక్ న్యూస్ ప్రభావం – నిజం, అపోహల మధ్య గల వ్యత్యాసం” – ఐఎస్‌బి డేటా సైన్స్ కళాశాల అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ శృతి మంత్రి.

ఇది కూడా చదవండి…ఆపిల్ తినడం ద్వారా బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తొలగించవచ్చా..?

ఇది కూడా చదవండి…ఆరోగ్యశ్రీ ద్వారా నిమ్స్‌లో యువకుడికి విజయవంతమైన హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్

ఈ శిక్షణ కార్యక్రమానికి హైదరాబాద్ నగరంతో పాటు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 50 మంది మహిళా జర్నలిస్టులు హాజరయ్యారు. జర్నలిస్టుల అభివృద్ధికి ఉపయోగపడే 10 పుస్తకాలు, సర్టిఫికెట్లు అకాడమీ అందజేసింది. కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు, మహిళా జర్నలిస్టుల సమన్వయకర్త రాజేశ్వరి, ఇతర ముఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.