365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఏప్రిల్ 7,2021:ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ ఇప్పుడు ఆరోగ్య పరీక్షల ప్యాకేజీని ఆవిష్కరించింది. ఆరోగ్య సంరక్షణ వ్యవస్ధలో అసమానతలను గతానికన్నా మిన్నగా కోవిడ్–19 చూపింది. ఇప్పటికీ ఎంతోమంది మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవలను పొందలేకపోతున్నారనే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని, కేర్ హాస్పిటల్స్ ఇప్పుడు ఈ ప్యాకేజీని ప్రజలు నివారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు ప్రోత్సహిస్తూ ఆవిష్కరించింది.
ప్రతి ఒక్కరూ మెరుగైన ఆరోగ్యానికి అనుకూలమైన జీవన, పని పరిస్థితులు కలిగి ఉన్నారని నిర్ధారించాలనే ఈ సంవత్సర నేపథ్యంకు అనుగుణంగా, కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ, హైదరాబాద్ ఇప్పుడు వరల్డ్ హెల్త్ డే నివారణ ఆరోగ్య పరీక్షల ప్యాకేజీని ఒక్కొక్కరికీ 1750 రూపాయల ధరలో ఆవిష్కరించింది. డాక్టర్ రవి కిరణ్ ముదునూరి, హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ, హైదరాబాద్ మాట్లాడుతూ ‘‘ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను సరిగా పొందలేకపోవడం చేత అతి సులభంగా నయం చేయగలిగిన వ్యాధుల కారణంగా కూడా ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారు. నివారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి ఆస్పత్రికి వెళ్లేలా సమాజంలో బీద వర్గాల ప్రజలను సైతం ప్రోత్సహించినప్పుడు మరెన్నో జీవితాలను కాపాడగలం. అంతర్జాతీయ మహమ్మారి కారణంగా ఆస్పత్రికి వెళ్తే ఎక్కడ అంటువ్యాధి తమకు తగులుతుందో అనే భయంతో చికిత్సను ఆలస్యం చేయడం వల్ల పరిస్థితులు మరింతగా దిగజారుతున్నాయి.
ఈ ప్యాకేజీని ఆవిష్కరించడంలో ప్రధానమైన లక్ష్యం ఏమిటంటే, ప్రతి ఒక్కరికీ కనీస ఆరోగ్య సంరక్షణను అందుబాటులో ఉంచడం మరియు శరీరం లోపల దాగి ఉన్న సమస్యలను కనుగొనడంలో సహాయపడటం’’ అని అన్నారు. ఆయనే మాట్లాడుతూ మిషన్ సురక్ష కార్యక్రమంలో భాగంగా అన్ని మార్గదర్శకాలనూ ఆస్పత్రిలో అమలులో ఉంచినట్లు తెలిపారు. హైటెక్ సిటీ కేర్ హాస్పిటల్స్‌లో మాత్రమే ఏప్రిల్ 30వ తేదీ వరకూ అందుబాటులో ఉండే ఈ ప్యాకేజీ వాస్తవధర 3,250 రూపాయలు కాగా దానిని ఇప్పుడు ఒక్కొక్కరికీ 1750 రూపాయలకు అందిస్తున్నారు. ఈ ప్యాకేజీలో సీబీసీ, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, సెరమ్ క్రియాటిన్, ఈసీజీ, లిపిడ్ ప్రొఫైల్, యూరిన్ రొటీన్, చెస్ట్ ఎక్స్ రే, యుఎస్‌జీ అబ్డోమెన్ మరియు ఫిజీషియన్ కన్సల్టేషన్ భాగంగా ఉంటాయి. మరిన్ని వివరాలు, అపాయింట్ మెంట్ కోసం 040–6165 6565 నెంబర్‌లో సంప్రదించవచ్చు.