Fri. Nov 22nd, 2024
world-heart-day

ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రత్యేక కథనం..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 29,2022: పొద్దున్నే నిద్రలో ఉండగానే అమ్మో..! నిన్నటి వర్క్ అంతా పెండింగ్ ఉంది. ఇవాళైనా ఆ వర్క్ పూర్తి చేయకపోతే బాస్ ఏమంటాడో..? తొందరగా వర్క్ కంప్లీట్ చేయాలి..? పిల్లలకు స్కూల్లో ఫీజు కట్టాలి..కారుకి ఈఎమ్ఐ పే చేయాలి..వచ్చేనెలలో ఊరికెళ్ళాలి..? మనస్సులో ప్రతిక్షణం మెదిలేవి.. ఇలాంటివే..! ఒత్తిడి పెరగడానికి ప్రధాన కారణాలు ఇవే..

world-heart-day

ఇలాంటి సమయాల్లోనే గుండె వేగంగా కొట్టుకోవటం, మూడ్‌ మారిపోవటం వంటివి జరుగుతుంటాయి. ఇవన్నీ ఒత్తిడి, ఆందోళన లక్షణాలు.. ఇవి రక్తపోటును విపరీతంగా పెంచేస్తాయి. తాత్కాలిక ఒత్తిడి శరీరం మీద చూపించే ప్రభావం గురించి చింతించాలా? లేకపోతే దీర్ఘకాల ఒత్తిడే సమస్యలను సృష్టిస్తుందా? అంటే అవుననే చెబుతున్నాయి పరిశోధనలు.

ఒత్తిడి, ఆందోళనల కారణంగా రక్తపోటు, గుండెజబ్బులూ తలెత్తు తున్నాయి. ఒత్తిడి రెండురకాలు.. అప్పటికప్పుడు ఒక్కసారిగా వచ్చే ఒత్తిడి ఒకటైతే. మరొకటి దీర్ఘకాల ఒత్తిడి. ఇవి రెండూ బ్లడ్ ప్రజర్ మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. దీని కారణంగా గుండెకు ముప్పు కలుగుతుంది.

ఒత్తిడి..పాము కాటు కంటే ప్రమాదం.. ప్రస్తుతం సమస్త రోగాలకు ఇదే కారణం.. మూడేళ్ళ వయసున్న చిన్నారుల దగ్గర నుంచి నూరేళ్ళ వృద్ధుల వరకు అందరూ అన్ని వయసులవాళ్ళు ఒత్తిడి బారీన పడుతూనే ఉన్నారు. అసలు ఒత్తిడి అనేది ఎక్కడ మొదలవు తుందంటే..? నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఒత్తిడి మనిషిని నీడలా వెంటాడుతూనే ఉంటుంది.

ఇలా చేస్తే మరింత బెన్ఫిట్..

world-heart-day

గుండె జబ్బులతో బాధపడే యువకులు, స్టెంట్స్ వేయించు కోవడం, లేదా బైపాస్ సర్జరీలు చేయించుకున్నప్పటికీ గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇతర వ్యక్తులపై కేకలు వేయడంవల్ల కోపం, చికాకు, ప్రతికూల భావాలు, భావోద్వేగాలు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయని కార్డియాలజిస్టులు వెల్లడిస్తున్నారు. అయితే కోపాన్ని ఆరోగ్యకరమైన రీతిలో తగ్గించుకోవడం ద్వారా కొంతమేర గుండె జబ్బుల నుంచి బయట పడొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఒత్తిడి తగ్గించుకోవడానికి కొంతమంది సంగీతం వింటూ ఉంటారు. మరోకొంతమంది పాటలు పాడుతారు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో రకంగా స్ట్రెస్ ను తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ వీటన్నిటికంటే కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త ప్రయోగాలు చేయడం ద్వారా మరింత ప్రయోజనం ఉంటుందని సైకాలజిస్టులు చెబుతున్నారు.

ఒత్తిడిని హరించే మెడిటేషన్

తక్షణ ఒత్తిడి అయినా, దీర్ఘకాల ఒత్తిడి అయినా.. రెండింటి నుంచీ బయటపడటానికి మెడిటేషన్ బాగా ఉపయోగపడుతుంది. ఆందోళన సైతం తగ్గుతుంది. కాబట్టి రోజూ కాసేపు మనసును కుదురుగా నిలిపే మెడిటేషన్ చేయటం మంచిది. ప్రశాంతంగా, స్థిరంగా కూర్చొని శ్వాస మీద ధ్యాస నిలిపినా చాలు. మనసు తేలికపడుతుంది.

error: Content is protected !!