365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 5,2024 : సమోసా! ఈ పేరు వినగానే మిగతా వాటికి మించి గుర్తుకు వచ్చే రుచికర వంటకం. సమోసా ప్రియులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. కానీ, చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, ఈ సమోసా భారతదేశంలో పుట్టిందే కాదు! దాని అసలు పుట్టుక ఎక్కడో తెలిస్తే మీకు ఆశ్చర్యం కలగక మానదు.
సమోసా భారతదేశ వంటకం కాదు? నిజమే మరి..! సమోసా అసలు భారతదేశపు వంటకం కాదు. 10వ శతాబ్దంలో ఇరాన్ , మధ్యప్రాచ్య ప్రాంతాల్లో పుట్టుంది. అప్పట్లో దీని పేరు ‘సంసా’గా ఉండేది. మాంసంతో నింపి దీన్ని తయారు చేసేవారు. ఈ రుచికర వంటకం తరువాత మేఘాలయం నుండి ఏషియా వరకు వ్యాపించింది.
కేవలం రాజవంశాలకు మాత్రమే అందుబాటులో ఉన్న సమోసా 13వ శతాబ్దంలో సమోసా కేవలం అరబ్ , మధ్యప్రాచ్య ప్రాంతాల రాజవంశాలకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఈ వంటకం ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే తయారు చేసేవారు.
సమోసా అసలు మాంసాహార వంటకం మనకు సమోసా అంటే తరచుగా కూరగాయలు, ఆలూ, పానీర్ వంటి పదార్థాలతో నింపి వేయించిన వంటకం గుర్తుకువస్తుంది. కానీ, అసలు సమోసా మాంసం, డ్రై ఫ్రూట్స్, పిస్తా, మసాలాలతో తయారుచేసేవారు.
సమోసా ఆకారం సమోసా ట్రైకోణం ఆకారంలో ఎందుకు ఉంటుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఆకారం పిరమిడ్స్ ను పోలినందున సమోసాకు ఈ ఆకారం వచ్చింది అని నిపుణులు అంటున్నారు. సమోసా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. సెప్టెంబర్ 5 తేదీన ప్రపంచ సమోసా దినోత్సవాన్ని జరుపుకుంటారు.