365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 11,2025: ముంబై ఇండియన్స్ గుజరాత్ జెయింట్స్‌పై మరోసారి ఆధిపత్యం ప్రదర్శించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (54) అర్ధశతకంతో పాటు బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ముంబై, గుజరాత్‌ను 9 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో డబ్ల్యుపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ గుజరాత్‌పై 6-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
బ్రెబోర్న్లో ముంబై దూకుడు
ముంబైలోని బ్రెబోర్న్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 170 పరుగులకే ఆలౌటైంది.
ఇది కూడా చదవండి…పాసుపుస్తకాలతో పాత లే ఔట్ల కబ్జాలు.. హైడ్రా ప్రజావాణికి అందిన 63 ఫిర్యాదులు..
ఇది కూడా చదవండి…మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా శ్రీలీలకు ప్రత్యేక సన్మానం
ఆరంభంలోనే గుజరాత్ కష్టాలు
180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ తొలుత కుదురుకోలేకపోయింది. బెత్ మూనీ (7) నాలుగో ఓవర్లో హేలీ మాథ్యూస్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చింది. కాశ్వీ గౌతమ్ (10) రనౌట్ కాగా, కెప్టెన్ ఏష్లే గార్డ్నర్ డకౌట్ కావడంతో గుజరాత్ ఒత్తిడిలో పడింది.

భారతి ఫూల్మాలీ వీరోచిత పోరాటం
గుజరాత్ జట్టు 50 పరుగుల మార్క్ దాటిన వెంటనే హర్లీన్ డియోల్ (24), ఫోఎబ్ లిచ్‌ఫీల్డ్ (22), డియాండ్రా డాటిన్ (10) వికెట్లు కోల్పోయింది. అయితే, భారతి ఫూల్మాలీ (61) దూకుడు చూపించింది. 25 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 244 స్ట్రైక్‌రేట్‌తో వీరవిహారం చేసింది. కానీ, ఆమెను ఎమిలియా కర్ పెవిలియన్‌కు పంపడంతో గుజరాత్ ఆశలు ఫలించలేదు.
ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్, ఎమిలియా కర్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. షబ్నిమ్ ఇస్మాయెల్ రెండు వికెట్లు తీయగా, సంస్కృతి గుప్తా ఒక్క వికెట్ ఖాతాలో వేసుకుంది.
ఇది కూడా చదవండి…విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకుంటారా..?
హర్మన్‌ప్రీత్ మెరుపు ఇన్నింగ్స్
ముంబై బ్యాటింగ్‌లో తొలి వికెట్ త్వరగానే కోల్పోయింది. ఎమిలియా కర్ (5) రనౌట్ కాగా, హేలీ మాథ్యూస్ (27) – నాట్ సీవర్ బ్రంట్ (38) కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. హర్మన్‌ప్రీత్ కౌర్ అర్థశతకం (54)తో ఆకట్టుకోగా, అమన్‌జోత్ కౌర్ (27) మద్దతునిచ్చింది. దీంతో ముంబై 179/6 స్కోర్ సాధించింది.

పాయింట్ల పట్టికలో ముంబై రెండో స్థానం
ఈ విజయంతో ముంబై ఇండియన్స్ 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు, గుజరాత్ జెయింట్స్ 8 మ్యాచ్‌ల్లో 4 ఓటములతో మూడో స్థానంలో కొనసాగుతోంది.