365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి 8,2025: భారతదేశంలో అత్యంత విశ్వస నీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా పేరుగాంచిన షియోమీ ఇండియా, బడ్జెట్ ఫోన్ విభాగంలో మరో మైలురాయిని చేరుకుంది. ఈరోజు కంపెనీ రెడ్‌మీ 14C 5G పేరుతో తన తాజా స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. అత్యాధునిక ఫీచర్లతో, నిరంతరాయమైన పనితీరుతో అత్యంత వేగవంతమైన 5G కనెక్టివిటీతో ఈ ఫోన్‌ను భారత వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రూపొందించారు.
![](http://365telugu.com/wp-content/uploads/2025/01/real-me.jpg)
₹1000 కోట్ల మైలురాయి – రెడ్‌మీ నోట్ 14 5G సిరీస్ విజయాన్ని ఆస్వాదిస్తూ
రెడ్‌మీ నోట్ 14 5G సిరీస్ ఆవిష్కరణ తరువాత కేవలం రెండు వారాల్లోనే రూ.1000 కోట్ల ఆదాయాన్ని సాధించడం షౌమీ విజయగాధలో కీలక ఘట్టంగా నిలిచింది. ఈ విజయాన్ని గుర్తిస్తూ కంపెనీ ఇప్పుడు రెడ్‌మీ 14C 5G ఫోన్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. https://www.mi.com/in/
రెడ్‌మీ 14C 5G – ఫీచర్లు, పనితీరు హైలైట్స్
డిస్‌ప్లే: 17.5 సెం.మీ (6.88-అంగుళాల) HD+ డాట్ డ్రాప్ డిస్‌ప్లే, గరిష్టంగా 600 నిట్స్ ప్రకాశం
ప్రాసెసర్: శక్తివంతమైన Snapdragon 4 Gen 2 5G ప్రాసెసర్
రామ్ & స్టోరేజ్: 12GB RAM (6GB + 6GB ఎక్స్‌టెన్షన్), 128GB UFS 2.2 స్టోరేజ్
కెమెరా: 50MP AI డ్యుయల్ కెమెరా
బ్యాటరీ: 5160mAh బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో
ఆపరేటింగ్ సిస్టమ్: షౌమీ హైపర్ OS (Android 14తో పాటు రెండు సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్)
ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్: 1TB మైక్రో SD కార్డ్ సపోర్ట్
ధర, లభ్యత:
రెడ్‌మీ 14C 5G ఫోన్ జనవరి 10, 2025 నుంచి Mi.com, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ , ఇతర షౌమీ రిటైల్ స్టోర్లలో లభిస్తుంది.
![](http://365telugu.com/wp-content/uploads/2025/01/real-me.jpg)
4GB + 64GB వెర్షన్ రూ. 9,999
4GB + 128GB వెర్షన్ రూ. 11,999
6GB + 128GB వెర్షన్ రూ. 12,999
రెడ్‌మీ నోట్ 14 సిరీస్ ప్రత్యేకతలు
రెడ్‌మీ నోట్ 14 5G సిరీస్ స్మార్ట్‌ఫోన్లు గోరిల్లా గ్లాస్ విక్టస్ 2, IP69 ప్రొటెక్షన్, మరియు సాలిడ్ ఎలక్ట్రోలైట్ బ్యాటరీ టెక్నాలజీ వంటి అత్యాధునిక ఫీచర్లతో అందుబాటులోకి వచ్చాయి.
50MP సోనీ LYT-600 కెమెరా
120Hz AMOLED డిస్‌ప్లే
ఈ సిరీస్ వినియోగదారులకు అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియెన్స్, మెరుగైన కెమెరా పనితీరు అందిస్తూ మిడ్-రేంజ్ సెగ్మెంట్లో బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తోంది.
షౌమీ మిషన్ – వినియోగదారుల నమ్మకానికి అండగా
షౌమీ ఇండియా భారత వినియోగదారులకు అత్యాధునిక టెక్నాలజీ, అందుబాటులో ఉండే ధరలు, ప్రతిరోజూ నిరంతరాయ ఆవిష్కరణలు అందించే లక్ష్యంతో ముందుకెళ్తోంది. రెడ్‌మీ 14C 5G ,రెడ్‌మీ నోట్ 14 5G సిరీస్ దీనికి పరిపూర్ణ నిదర్శనం.