Mon. Dec 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ముంబై,ఏప్రిల్ 4,2024: భారతదేశంలో దిగ్గజ ఎస్‌యూవీ తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమ కొత్త ఎస్‌యూవీ పేరుని XUV 3XO (ఎక్స్‌యూవీ త్రీ ఎక్స్‌ వో)గా ప్రకటించింది.

ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించనున్న ఈ వాహనం, తన విభాగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పనుంది. ఎక్స్‌యూవీ బ్రాండ్‌కి మాత్రమే సొంతమైన ఆధునికత, నూతన టెక్నాలజీతో ఇది రూపొందించింది.

“మీరు కోరుకునే దానితో పాటు అంతకు మించి”Top of Form అందించేలా తీర్చిదిద్దిన XUV 3XO అచ్చంగా మహీంద్రా ఎస్‌యూవీ ప్రత్యేకతలకు నిదర్శనంగా నిలుస్తుంది. అచ్చెరువొందించే పనితీరు, అధునాతన టెక్నాలజీ, చూపు మరల్చుకోనివ్వని డిజైన్, అసమానమైన భద్రత మేళవింపుతో ఇది పట్టణప్రాంత కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా తీర్చిదిద్డింది.

ప్రతి ప్రయాణంలో మూడు రెట్లు మెరుగైన అనుభూతిని అందించే ఈ వాహనం ఎస్‌యూవీల యజమానుల ఆకాంక్షలకు మించిన పనితీరు కనపర్చగలదు.

అద్దంలో చూస్తే టాప్ ఎగ్జిక్యూటివ్‌ ‘CXO’ స్థాయిని ప్రతిబింబించేలా కనిపించే XUV 3XO, వృద్ధిపథంలో దూసుకెడుతున్న వారి ఆకాంక్షలకు అనుగుణంగా నిలుస్తుంది. సెగ్మెంట్‌లోనే అత్యుత్తమమైన ఫీచర్లతో తీర్చిదిద్దిన ఈ ఎస్‌యూవీ, తమ జీవితంలో ప్రతి ఒక్కటి అత్యుత్తమంగా ఉండాలని కోరుకునే వారికి అనువైనదిగా ఉండగలదు.

మహారాష్ట్రలోని నాసిక్‌లో కంపెనీకి గల ప్లాంటులో కొత్త XUV 3XO తయారు చేయనుంది.

YouTube Link:Say hello to the Mahindra XUV 3XO

Social Media Addresses for Mahindra XUV 3XO:

· Brand website: https://auto.mahindra.com/suv/XUV3XO

· Twitter: @MahindraXUV3XO

· YouTube: @Mahindra_XUV3XO

· Instagram: @mahindraxuv3xo

· Facebook: @XUV3XO

· Hashtags: #MahindraXUV3XO #XUV3XO

ఇది కూడా చదవండి:కేక్ తిని బాలిక మృతి చెందడంతో బేకరీలు, షాపులపై దాడులు చేసిన ఆరోగ్యశాఖ

ఇది కూడా చదవండి: OnePlus Nord CE4 ఫోన్‌ కొంటే..ఇయర్ బడ్స్‌ ఫ్రీ..నేటి నుంచే అమ్మకాలు..

This Also read: XUV 3XO: The Newest SUV from Mahindra

error: Content is protected !!