Fri. Nov 22nd, 2024

కూటమి అభ్యర్ధికి వైకాపా ఎంపీ ఇంచార్జి ఆడారి కిషోర్ సవాల్

మే 6, 2024: ప్రతిపక్షాలు ఇష్టానుసారంగా తప్పుడు ప్రచారం చేస్తున్న ల్యాండ్ టైట్లింగ్ ఆక్ట్ పై నోరు విప్పి, నిజాలు చెప్పాలని ప్రధాని నరేంద్ర మోడీ కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి లోక్ సభ ఇంచార్జి ఆడారి కిషోర్ కుమార్ బహిరంగ సవాల్ విసిరారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ఈ చట్టం అద్భుతంగా ఉందని, తమ పార్టీ మద్దతు ఇస్తోందని, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అసెంబ్లీ లోనే చెప్పారన్నారు. ఈ చట్టం పై అవాస్తవాలు ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్ లపై సిఐడి కి ఫిర్యాదు చేశామని, వాళ్ళు విచారణ చేస్తారన్నారు.

సీఎం రమేష్..డబ్బు మదం కాదు, దమ్ముంటే నాతొ డిబేట్ కి రా

కేవలం డబ్బు మదం తప్ప మరో అర్హత తప్ప కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కు లేదని, దమ్ముంటే తనతో డిబేట్ కు రావాలని ఆడారి కిషోర్ కుమార్ సవాల్ విసిరారు. కడప నుంచి కోట్లాది రూపాయలతో వలస వచ్చి, అనకాపల్లి ని ఉద్ధరిస్తానని బీజేపీ అభ్యర్థిగా వచ్చారని, అతనికి కనీసం అనకాపల్లి ఎల్లలు కూడా తెలియదన్నారు. గత పదేళ్లుగా రాజ్యసభగా సభ్యునిగా ఆంధ్ర ను ఏమాత్రం ఉద్దరించారో చెప్పాలన్నారు. తనకు ఏపీ లోని సమస్యలు పూర్తిగా అవగాహనా ఉందని, సీఎం రమేష్ కు దమ్ముంటే తనతో ఓపెన్ డిబేట్ కు రావాలని సవాల్ విసిరారు.
కడప, తెలంగాణ కు చెందిన వందలాదిగా వాహనాలు తరలించి అనకాపల్లి లో ప్రచారం వాడుతున్నారన్నారు. అతని చిత్తశుద్ధి ఇక్కడే తెలిసిందన్నారు. స్థానిక వాహనాలను వాడితే స్థాయి స్థానిక యువతకు కొంత ఉపాధి జరుగుతుందన్నారు. కనీసం ఈ మాత్రం సాయం కూడా స్థానికులకు చెయ్యడం ఇష్టపడని వ్యక్తి ఎంపీ అయితే ఏమి ఉద్ధరిస్తాడని మండిపడ్డారు.

ఇక అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ గతంలో మంత్రిగా ఉంది ఏమి ఉద్దరించాడో తమకు తెలుసునని, అతని గురించి వ్యాఖ్యానించడం కూడా సమయం వృధా అన్నారు. ఈ సమావేశంలో స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులూ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!