Fri. Oct 11th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 20,2024: తిరుమలలో ప్రసాదంగా అందించే లడ్డూలలో జంతువుల కొవ్వు కలిపినట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై వైసీపీ ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది.

ఈ పిటిషన్‌లో, చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ, తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ .

విచారణకు కోర్టు ఆదేశాలు..

తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి ఉపయోగానికి సంబంధించి సిటింగ్ జడ్జి లేదా హైకోర్టు నియమించిన కమిటీ ద్వారా విచారణ జరిపించాలని వైసీపీ తన పిటిషన్‌లో కోరింది. ఈ ప్రక్రియ ద్వారా నిజానిజాలు వెలుగులోకి వస్తాయని వెల్లడించింది.

హైకోర్టు స్పందన..

ఈ పిటిషన్‌ను స్వీకరించింది హైకోర్టు. కాగా విచారణను బుధవారానికి వాయిదా వేసింది. కోర్టు తదుపరి విచారణకు సంబంధించి అందులోని అంశాలను చర్చించనుంది.

నేపథ్యం..

ఈ వివాదం, తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యత, ఆరోగ్య సంబంధిత అంశాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా భక్తులకు , లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. దీంతో, ప్రభుత్వ, రాజకీయ వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

అధికారిక ప్రతిస్పందన..

ఇప్పుడు అధికారికంగా ఈ ఆరోపణలపై తేల్చేందుకు కోర్టు ఎలా నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. భక్తుల ఆరోగ్యానికి , ఆధ్యాత్మిక అనుభవానికి సంబంధించి ఈ వివాదం చాలా కీలకమైనది. ఈ పరిణామాలపై దేశ వ్యాప్తంగా తీవ్రంగా చర్చ జరుగుతుంది.

error: Content is protected !!