YPM365

365తెలుగు డాట్ కామ్ న్యూస్, ఖమ్మం, మార్చి 9,2023: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు గతకొన్ని నెలలుగా అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయడం లేదని పలువురు ప్రజాప్రతినిధులు జనరల్ బాడీ మీటింగ్ లో ఆరోపించారు.

కరెంట్ బిల్లులు, ట్రాక్టర్ ఈఎంఐ లు, మల్టీ పర్పస్ వర్కర్లకు గత ఐదు నెలల నుంచి జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో గ్రామ పంచాయతీలు కు నారిలిల్లుతున్నాయని బనిగండ్లపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ జంగా పుల్లారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మండల కేంద్ర మైన ఎర్రుపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సాధారణ సమావేశాన్ని ఎంపీపీ దేవరకొండ శిరీష అధ్యక్షతన నిర్వహించారు.

తొలుత వ్యవసాయ శాఖ పై సమీక్ష ప్రారంభించగా వ్యవసాయ విస్తరణ అధికారి ధాత్రి మాట్లాడుతూ రైతుబంధు15 ఎకరాల లోపు కొద్దిమంది రైతులకు వారి ఎకౌంట్లో జమ చేయడం జరిగిందని, సాంకేతిక కొన్ని కారణాల వలన మిగిలిన రైతులకు రెండు మూడు రోజుల లో విడుదలవుతాయని తెలిపారు.

ఇరిగేషన్ ఏఐ సాంబశివరావు మాట్లాడుతుండగా పెగళ్లపాడు ఎంపీటీసీ సగ్గుర్తి కిషోర్ బాబు, బనిగండ్లపాడు పంచాయతీ సర్పంచ్ జంగా పుల్లారెడ్డి ఆ గ్రామాలలో గల వాటర్ ట్యాంకులు పడిపోయే దశలో ఉన్నాయని వాటిని తొలగించి నూతన ట్యాంకులను నిర్మించాలని డిమాండ్ చేయగా, ఎంపీడీవో శ్రీనివాసరావు కలగ జేసు కొని ప్రతి పాదనలు పంపిస్తామని జవాబు ఇచ్చారు.

YPM365

రెవిన్యూ శాఖ పై సమీక్ష నిర్వహించగా తాసిల్దార్ తిరుమలాచారి మాట్లాడుతూ… ప్రభుత్వం అర్హులైన పేద లందరికీ ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ప్రభుత్వ స్థల సేకరించాలని కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయని తెలిపారు.

గ్రామ పంచాయతీ సర్పంచులు ప్రజా ప్రతి నిధులు గ్రామాలలో ప్రభుత్వ భూమిని తెలియపరచాలని రెవెన్యూ శాఖకు సహకరించాలని కోరారు.

ఓ దశలో ఇరిగేషన్ ఏఈ సాంబశివరావు ని గ్రామ పంచాయతీ సర్పంచ్ లు కలిసి నీళ్లు లేక రైతులు పండించిన పంట పొలాలు ఎండి పోతున్నాయని, సాగర్ జలాలను వెంటనే విడుదల చేసి రైతులను ఆదుకోవాలని, ఎండా కాలం ప్రారంభ మైన దశ లో త్రాగు నీటి ఎద్దడి లేకుండా ఎరుపాలెం మండలం లోని అన్ని చెరువులను సాగర్ జలాలతో నింపి త్రాగునీటి ఎద్దడి లేకుండా నివారించాలని డిమాండ్ చేశారు.

YPM365

కరెంటు సమస్యలపై ఎర్రుపాలెం సొసైటీ చైర్మన్ మూల్పూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ… జమలాపురం గ్రామంలో రైతులు వినియోగించుకునే విద్యుత్ ట్రాన్స్ ఫారం కాలిపోయి చాలా రోజులు అవుతున్నా.. పట్టించు కోవడం లేదని ఎన్నిసార్లు ట్రాన్స్కో అధికారుల దృష్టికి తెచ్చినా పట్టించు కోలేదని ట్రాన్స్ఫారం వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్య క్రమంలో పలువురు గ్రామపంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ప్రజాప్రతి నిధులు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.