Thu. Nov 21st, 2024
Yerrupalem_365Telugu

జోరందుకోనున్న రియల్ ఎస్టేట్ బిజినెస్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఎర్రుపాలెం,మార్చి28,2023: తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సరిహద్దున ఉన్న ఎర్రుపాలెం మండలంలో రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఊపందుకుంటున్నాయి.

ఎర్రుపాలెం రైల్వేస్టేషన్ కు అమరావతి రైల్వే లైన్ రాకతో రియల్ భూమ్ ఒక్కసారిగా పెరిగింది. దీంతో అక్కడి చుట్టుపక్కల గ్రామస్తులు అదృష్టంగా భావిస్తున్నారు.

గత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని విజయవాడ బైపాస్ రైల్వే లైన్ మార్గపై దృష్టి పెట్టారు.

దీంతో అమరావతి నూతన రైల్వే ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. ఏపీ రాష్ట్రానికి రాజధాని కనెక్టివిటీ కోసం తెలంగాణ రాష్ట్రంలో సరిహద్దు మండలం గా గ్రామంగా ఉన్న ఎర్రుపాలెం నుంచి నూతన రైల్వే లైన్ ప్రతిపాదన తీసుకువచ్చింది.

Yerrupalem_365Telugu

అయితే అప్పటి ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ఆహ్వానించినా 2017-18 బడ్జెట్లో గుంటూరు విజయవాడ నగరాల మీదుగా అమరావతిని అనుసంధానం చేసేందుకు రూ.2800 కోట్లుతో ప్రతిపాదించారు.

అప్పటి ప్రభుత్వం కేంద్రం కాస్ట్ షేర్ ను అడగ్గా టిడిపి ప్రభుత్వం సానుకూలంగా అంగీకరించింది. అనంతరం ఏపీలో ఏర్పడిన వైసిపి సర్కార్ రైల్వే లైన్ కు భూసేకరణ భారాన్ని భరించలేమని మోకాలు అడ్డుపెట్టింది.

దీంతో నిలిచిపోయిన అమరావతి లైన్ పనులను విజయవాడ రైల్వే అధికారులు ఇప్పుడు మళ్లీ తెరపైకి తేవడంతో ఎర్రుపాలెం ప్రాంతంలో ఉన్న భూములకు డిమాండ్ పెరుగుతున్నట్లు భూస్వాములు, రియల్టర్లు భావిస్తున్నారు.

ఒక్కో ఏరియాలో ఒక్కో ధర ఎర్రుపాలెం మండలం ఏపీ రాష్ట్రానికి ఆనుకొని ఉండడంతో వీరులపాడు, జి కొండూరు, మైలవరం, తిరువూరు, నియోజక వర్గాలకు దగ్గరగా ఉండటంతో ఇప్పటికే ఆయా భూముల ధరలు ఎకరం 30 లక్షల వరకు ఉండగా, ప్రస్తుతం అమరావతి రైల్వే లైన్ వస్తుందని వాదనలు వినిపిస్తుండడంతో..ఆ రేట్లు సైతం మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.

సారవంతమైన భూములు..

ఎర్రుపాలెం మండలంలో ఎక్కువ సారవంతమైన భూములు ఉండడం, తో ఈ ప్రాంతం రైతులు మిర్చి, పత్తి వంటి పంటలను పండిస్తూ..మంచి లాభాలు గడిస్తున్నారు. దీంతో మండలంలో ఉన్న భూముల ధరలు ఎన్నడూలేని విధంగా పెరుగుతున్నాయి. దానికి తోడు నూతనంగా రైల్వే లైన్ రావడం తో ఎకరం రూ.40లక్షలవరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

గ్రీన్ ఫీల్డ్ కారణంగా మరింతగా పెరగవచ్చు..

Yerrupalem_365Telugu

దీనికి తోడు నాగపూర్- విజయవాడ నేషనల్ గ్రీన్ ఫీల్డ్ కు అధికారులు సర్వే నిర్వహించి సుమారు 62 ఎకరాల భూసేకరణ చేయడంతో ఈ ప్రాంతంలో భూములకు మరింత విలువ పెరుగుతుందని భావిస్తున్నారు.

ఇటు రైల్వే లైన్ అటు నేషనల్ గ్రీన్ ఫీల్డ్ (నాలుగు లైన్ల రహదారి)మధిర మండలంలోని ఆత్మకూరు ఎర్రుపాలెం మండలంలోని మీనవోలు, పెగళ్ళపాడు, ఎర్రుపాలెం,రేమిడిచర్ల, కొత్తపాలెం మీదుగా రోడ్డు ఆంధ్రప్రదేశ్ కు కలవనుంది.

ఇది కూడా ఎర్రుపాలెం మండలంలోని పొలాల రేట్లు పెరగడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ అధికారులు భూ నిర్వాసిత రైతులతో చర్చలు జరిపారు. ఎకరాకు భూమి కోల్పోయిన వారికి సుమారు 20 లక్షల వరకు నష్టపరిహారాన్ని అందించనున్నట్లు తెలుస్తోంది.

ఎర్రుపాలెం మండలంలో సుమారు 30నుంచి 40 లక్షల వరకు భూముల ధరలు ఉండడంతో, పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ భూములు ఎకరం 40నుంచి 50లక్షల పైనే కు ధర పలుకుతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం రైతులు కేంద్ర ప్రభుత్వం అందించే నష్టపరిహారాన్ని స్వీకరించే పరిస్థితుల్లో లేరని, నిర్వాసితులకు లాభం చేకూరే విధంగా అధికారులు ప్రయత్నించాలని ఎర్రుపాలెం మండల రైతులు కోరుతున్నారు.

error: Content is protected !!