Thu. Nov 21st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 20,2023: మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదించడంపట్ల డా.హిప్నో పద్మా కమలాకర్, బి.సరోజని, జి.కృష్ణ వేణి, డా.గీత హర్షం వ్యక్తం చేశారు.

మంగళవారం డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ లో పత్రికా విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో ఈ మహిళా బిల్లుకు ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకుందన్నారు.

ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే..లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయని తెలిపారు.

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఇప్పటిది కాదన్నారు. ఈ బిల్లును 1996లో హెచ్‌డీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం తొలుత లోక్‌సభలో ప్రవేశపెట్టిందన్నారు.

వాజ్‌పేయీ, మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాల హయాంలోనూ ప్రవేశపెట్టినప్పటికీ ఈ బిల్లు సభ ఆమోదానికి నోచుకోలేదన్నారు. చివరకు ఈ బిల్లు

మోడీ సారథ్యంలోని కేబినెట్‌ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుందని ఆనందం వ్యక్తం చేసి ధన్యవాదాలు తెలిపారు.

రాజకీయంగా కూడా మహిళలు ఎదగడానికి ఇదో చక్కటి అవకాశమన్నారు. విద్యా ఉద్యోగాలలో ఎస్సీ మహిళా బీసీ మహిళ జనరల్ మహిళ కోట ఉన్నట్టే.. రేపటి నుంచి అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో కూడా ఈ రకంగా రిజర్వు కాబడి ఉంటాయన్నారు.

మహిళలకు కేటాయించిన సీట్లలో వారిని కూర్చోనిద్దాం అని ఆర్టీసీ బస్సులో రాసినట్టుగా ఈ చట్టం చట్టసభలలో అమలవుతోందని హర్షం వ్యక్తంచేశారు.

ఈ కార్యక్రమంలో డా.గీత, జి.కృష్ణ వేణి,శ్రీలత, ఉషా, సుజాత, పూర్ణ, జ్యోతి, సురేఖ, కల్పన, పి.స్వరూపా రాణి , డా.వి.జే.క్యార్లిన్ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!