365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి ,డిసెంబర్ 9,2022:జీ-20 సదస్సు పై ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్లో పలు రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా భారత్లో జరగనున్న జీ-20 సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించనున్నారు.దేశవ్యాప్తంగా జరగనున్న జీ-20 సదస్సుల్లో ఏపీకి కేంద్రం అధిక ప్రాధాన్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో ఏపీలో మూడు సదస్సులు నిర్వహించేందుకు ప్రధాని ప్లాన్ చేస్తున్నారు.
విశాఖపట్నం వేదికగా జి-20 సదస్సు జరిగే అవకాశం ఉంది.జీ-20 అధ్యక్షుడిగా భారత్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో.. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది నవంబర్ వరకు సదస్సులు, పలు కార్యక్రమాలను నిర్వహించా లని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో భాగంగా దేశంలోని 56 నగరాలు, పట్టణాల్లో వివిధ అంశాలపై 200 సదస్సులు నిర్వహించనున్నారు.