Mon. Oct 7th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి2,2024: హైదరాబాదులోని లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పార్టీ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు.

పార్టీ విలీనం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ సాగింది. షర్మిల కాంగ్రెస్‌లో చేరుతారనే ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

త్వరలోనే పార్టీ విలీనంపై ఆమె కీలక ప్రకటన చేస్తారని అంతా భావించారు. దీంతోపాటు బుధవారం రాత్రి ఆమె ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం.

సమావేశం అనంతరం షర్మిల ఇడుపులపాయకు వెళ్లి తన తండ్రి వైఎస్‌ఆర్‌ ఘాట్ వద్ద నివాళులర్పించారు. తన కుమారుడు రాజా రెడ్డి వివాహం సందర్భంగా ఆమె తన తండ్రి ఆశీర్వాదం కోసం వైఎస్‌ఆర్‌ ఘాట్ ను సందర్శించారు.

ఈ సందర్భంగా షర్మిలతోపాటు కాబోయే నూతన వధూవరులు రాజా రెడ్డి, ప్రియ ఉన్నారు.

error: Content is protected !!