365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూలై 30,2025: చిన్నారులకు సంగీత రంగంలో తమ ప్రతిభను నిరూపించుకునే అరుదైన అవకాశం లభిస్తోంది. ప్రముఖ టెలివిజన్ ఛానల్ జీ తెలుగు మరోసారి సా రే గ మ ప లిటిల్ ఛాంప్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని బాలగాయకులకు గొప్ప వేదిక అందించబోతోంది.

ఇప్పటికే 16 విజయవంతమైన సీజన్లతో సంగీత ప్రియులను మెప్పించిన ఈ షో, ఇప్పుడు 17వ సీజన్ కోసం ఆడిషన్స్ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో జీ తెలుగు సంస్థ ఆగస్టు 3 (ఆదివారం) నాడు హైదరాబాద్‌లోని అమీర్‌పేట శ్రీసారథి స్టూడియోస్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రతిభావంతుల ఎంపిక కోసం ఎంపికా పరీక్షలు నిర్వహించనుంది.

వయస్సు 4 నుండి 14 ఏళ్ల మధ్య ఉన్న చిన్నారులు ఈ ఆడిషన్స్‌లో పాల్గొనవచ్చు. గ్రామీణ ప్రాంతాలు సహా అన్ని మూలల నుంచి వచ్చే చిన్నారులకు ఇది ఒక విశేష అవకాశం. సంగీతం పట్ల అభిరుచి, వినూత్నత కలిగిన పిల్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.

ఆసక్తి గలవారు 91541 45100 నెంబర్‌కి సంప్రదించవచ్చు.