365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,మార్చి 25,2025: హాస్యభరిత వినోదానికి మజాకా టైమ్ ఆసన్నమైంది. సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన హిట్ ఎంటర్టైనర్ ‘మజాకా’ ఉగాది కానుకగా మార్చి 28 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో నవ్వుల బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో వినోదాన్ని పంచడానికి సిద్ధమైంది.

నవ్వుల హంగామాతో ‘మజాకా’
త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రావు రమేష్, అన్షు కీలక పాత్రలు పోషించారు. హాస్య ఎంటర్టైన్మెంట్, ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రాజేష్ దండ ఈ సినిమాను నిర్మించారు.

Read this also…PhonePe Launches New Vehicle Insurance For Two-Wheelers & Four-Wheelers

ఇది కూడా చదవండిహైద‌రాబాద్‌లో వ‌ర‌ద‌, అగ్ని ప్ర‌మాదాల నివారణకు చర్యలు – హైడ్రా, జీహెచ్‌ఎంసీ సమీక్ష

ఫిబ్రవరి 26న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకోబోతోంది.

జీ5లో ఉగాది స్పెషల్
జీ5 ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మ్యాక్స్’, ‘కుడుంబస్తన్’ వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించింది. ఇవి టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఉగాది ప్రత్యేకంగా ‘మజాకా’ ని అందిస్తూ హాస్యోత్సాహాన్ని రెట్టింపు చేయనుంది.

Read this also…Reasons Behind Rupee Depreciation

Read this also…Digital Tax on Online Advertisements Removed – Effective from April 1

జీ5 – భారతదేశ యువ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్
మల్టీలింగ్వల్ స్టోరీటెల్లింగ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జీ5, అత్యుత్తమ వీడియో స్ట్రీమింగ్ సేవలతో మిలియన్లాది మంది అభిమానులను సంపాదించింది. 3,500కు పైగా సినిమాలు, 1,750 టీవీ షోలు, 700 ఒరిజినల్స్‌ లతో భారీ కంటెంట్ లైబ్రరీ కలిగిన ఈ ప్లాట్‌ఫార్మ్ 12 భాషల్లో (తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, బెంగాలి, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ, పంజాబీ, ఇంగ్లీష్) విశేషమైన వినోదాన్ని అందిస్తోంది.