ZP Chairman Lingala Kamal Raju distributed Christmas gifts in YERRUPALEM

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఖమ్మం,డిసెంబర్ 20,2022: ఎర్రుపాలెంమండల కేంద్రంలో క్రైస్తవులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న గిఫ్ట్ ప్యాక్ లను ఖమ్మంజిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో క్రిస్మస్, రంజాన్, బతుకమ్మ పండుగలను ఘనంగా జరపడమేకాకుండా ఆయా పండుగల సందర్భంగా ప్రత్యేకంగా కానుకలు అందిస్తున్నామని, ఏ ప్రభుత్వం ఇలా అన్నిపండుగలను జరపడం లేదని అన్నారు.

నూతన వస్త్రాలను అందించి పండగలను ఆనందంగా జరుపుకునేందుకు తెలంగాణ సర్కారు కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

అనంతరం రెవెన్యూ కార్యాలయంలో తాసీల్దార్ తో మాట్లాడుతూ ధరణిలో అర్హులైన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎర్రుపాలెం ఎంపీడీవో శ్రీనివాసరావు, తాసిల్దార్ తిరుమల చారి, ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పీటీసీ శీలం కవిత, మధిర మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చావా రామకృష్ణ, ఎర్రుపాలెం మండల పార్టీ అధ్యక్షుడు పంబి సాంబశివరావు,

  ZP Chairman Lingala Kamal Raju distributed Christmas gifts in YERRUPALEM

మండల పార్టీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు రామకోటయ్య కత్తులు కిషోర్ బాబు, సర్పంచ్ లు మొగిలి అప్పారావు, కోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.