Mon. Dec 23rd, 2024
Umamaheswari

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఆగస్టు1, 2022: సీనియర్ నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చంద్రబాబు నాయుడు, బాకకృష్ణ, నారా లోకేష్, ఇతర కుటుంబ సభ్యులు ఆమె ఇంటికి చేరుకున్నారు. ఉమామహేశ్వరి అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిళ్లతో బాధపడుతున్నట్లు సమాచారం.

Umamaheswari

స్వర్గీయ ఎన్టీఆర్ చిన్న కూతురు కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం చెందిందని మొదట వార్తలు వచ్చాయి.ఆ తర్వాత ఆమె జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఇంకా స్పందించలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతికి గల కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

error: Content is protected !!