ADMISSION OPEN IN SV MUSIC AND DANCE COLLEGEADMISSION OPEN IN SV MUSIC AND DANCE COLLEGE
ADMISSION OPEN IN SV MUSIC AND DANCE COLLEGE
ADMISSION OPEN IN SV MUSIC AND DANCE COLLEGE

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,ఆగ‌స్టు 7,2021: టిటిడి ఆధ్వర్యంలో ఉన్న తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాద‌స్వ‌రం, డోలు పాఠ‌శాల‌లో 2021-22 విద్యా సంవత్సరానికి గాను పలు కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆగ‌స్టు 21వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.

ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో ఫుల్‌టైమ్ విశార‌ద‌(డిప్లొమా), ప్ర‌వీణ‌(అడ్వాన్డ్స్ డిప్లొమా) కోర్సులు, ఎస్వీ నాద‌స్వ‌రం, డోలు పాఠ‌శాల‌లో ఫుల్‌టైమ్ స‌ర్టిఫికేట్‌, డిప్లొమా కోర్సులు ఉన్నాయి.

అదేవిధంగా, గాత్రం, వీణ, వేణువు, వయోలిన్‌, మృదంగం, ఘ‌టం, భరతనాట్యం, కూచిపూడి నృత్యం, హరికథ విభాగాల్లో పార్ట్ టైమ్ స‌ర్టిఫికేట్‌, డిప్లొమా, క‌ళాప్ర‌వేశిక కోర్సుల‌కు ఆగ‌స్టు 31వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ADMISSION OPEN IN SV MUSIC AND DANCE COLLEGE
ADMISSION OPEN IN SV MUSIC AND DANCE COLLEGE

ఆసక్తి గల అభ్యర్థులు కళాశాల కార్యాలయ పనివేళల్లో రూ.50/- చెల్లించి దరఖాస్తు పొందొచ్చు. రెగ్యులర్‌ కోర్సులకు 8వ తరగతి, సాయంత్రం కళాశాలకు 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇతర వివరాలకు కళాశాల కార్యాలయ పనివేళల్లో 0877-2264597 నంబరులో సంప్రదించగలరు.