365తెలుగుడాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్, ముంబై, ఇండియా, జూన్ 21,2020: భారతదేశంలోని కోవిడ్-19 రోగుల కోసం మైలురాయి లాంటి అభివృద్ధిలో , పరిశోధనాధారిత, సమగ్రమైన అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ గ్లెన్‌మార్క్ నేడు తమ యాంటీ వైరల్ డ్రగ్ ఫావిపిరావిర్ (ఫాబీఫ్ల్ధూ బ్రాండ్ పేరిట)ను తేలికపాటి నుంచి మోస్తరు కోవిడ్-19 చికిత్స కోసం ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. భారతదేశపు ఔషద నియంత్రణ సంస్ధ నుంచి తయారీ , మార్కెటింగ్ అనుమతులను గ్లెన్‌మార్క్ అందుకుంది. తద్వారా కోవిడ్-19 చికిత్స కోసం భారతదేశంలో మొట్టమొదటి ఓరల్ ఫావిపిరావిర్ అనుమతించబడిన ఔషదంగా ఫాబీఫ్ల్ధూ నిలిచింది.బలీయమైన క్లీనికల్ ఆధారాలను ఫావిపిరావిర్ కలిగి ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు కోవిడ్-19 కలిగిన రోగులలో ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇది చూపింది. ఈ యాంటీవైరల్ విస్తృతస్థాయి స్పెక్ట్రమ్ ఆర్ఎన్ఏ వైరస్ కవరేజీని, చికిత్స పరంగా మెరుగైన ఫలితాలను 20 నుంచి 90 సంవత్సరాల లోపు వ్యక్తులలో గమనించారు. ఫావిపిరావిర్‌ను కో-మార్బిడ్ పరిస్థితులు అయినటువంటి మధుమేహం, గుండె జబ్బులు కలిగి తేలికపాటి నుంచి మోస్తరు కోవిడ్-19 లక్షణాలు కలిగిన రోగులలో సైతం పరీక్షించి చూశారు.
కేవలం నాలుగు రోజులలోనే వేగవంతంగా వైరల్ లోడ్‌ను ఇది తగ్గించగలిగింది , వేగవంతంగా రోగ లక్షణాలు, రేడియోలాజికల్ అభివృద్ధిని అందించింది. మరీ ముఖ్యంగా, కోవిడ్-19 మోస్తరు నుంచి తేలికపాటి లక్షణాలు కలిగిన కేసులలో 88% వరకూ క్లీనికల్ ఇంప్రూవ్మెంట్ను ఫావిపిరావిర్ ప్రదర్శించింది.గ్లెన్‌మార్క్ విజయవంతంగా యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్ (ఏపీఐ)ను అభివృద్ధి చేయడంతో పాటుగా ఫాబీఫ్లూ ఫార్ములేషన్‌ను తమ అంతర్గత ఆర్ అండ్ టీ బృందం ద్వారా తయారుచేసింది. భారతదేశపు ఔషద నియంత్రణ సంస్థ డీసీజీఐ వద్ద క్లీనికల్ ట్రయల్ కోసం గ్లెన్‌మార్క్ దరఖాస్తు చేసింది. తద్వారా తేలికపాటి నుంచి మోస్తరు కోవిడ్-19 రోగుల కోసం మూడవ దశ క్లీనికల్ ట్రయల్స్ కోసం భారతదేశంలో అనుమతులు అందుకున్న మొట్టమొదటి ఔషద సంస్థగా గ్లెన్‌మార్క్ నిలిచింది.
ఈ అభివృద్ధి యొక్క ప్రాముఖ్యత గురించి శ్రీ గ్లెన్ సాల్డన్హ, ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్-గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ మాట్లాడుతూ “గతంలో ఎన్నడూ లేనంత వేగంగా కోవిడ్-19 కేసులు భారతదేశంలో వృద్ధి చెందుతుండటంతో పాటుగా భారతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్ధపై అసాధారణ ఒత్తిడి కలిగిస్తున్న వేళ ఈ అనుమతులు వచ్చాయి. ప్రభావవంతమైన చికిత్స అయినటువంటి ఫాబీఫ్లూ లభ్యతతో ఈ ఒత్తిడిని కొంతమేరకు తగ్గించగలమని , సమయానికి తగిన చికిత్స అవకాశాన్ని భారతదేశంలో రోగులకు ఇది అందించనుందని మేము ఆశిస్తున్నాము” అని అన్నారు.ఆయనే మాట్లాడుతూ “తేలికపాటి నుంచి మోస్తరు కోవిడ్-19 రోగులలో క్లీనికల్ ట్రయల్స్ సమయంలో ప్రోత్సాహకరమైన స్పందనను ఫాబీఫ్లూ ప్రదర్శించింది. మరీముఖ్యంగా, దీనిని నోటిద్వారా తీసుకోవచ్చు , నరాల ద్వారా పంపే ఔషదాలతో పోలిస్తే ఇది అత్యంత సౌకర్యవంతమైన చికిత్సా విధానంగానూ నిలుస్తుంది. ప్రభుత్వం , మెడికల్ కమ్యూనిటీతో అతి సన్నిహితంగా గ్లెన్‌మార్క్ పనిచేయడం ద్వారా దేశవ్యాప్తంగా రోగులకు త్వరగా ఫాబీఫ్లూను చేరువ చేయనుంది” అని అన్నారు.ఫావిపిరావిర్‌ను జపాన్‌లో 2014 నుంచి నోవెల్ లేదా పునరాభివృద్ధి చెందుతున్న ఇన్‌ఫ్లూయెంజా వైరస్ చికిత్సల కోసం, అనుమతించబడింది.ఇది వినూత్నంగా పనిచేసే యంత్రాంగం కలిగి ఉంది.ఇది చురుకైన ఫాస్పోరిబోసిలేటెడ్ రూపం(ఫావిపిరావిర్-ఆర్టీపీ)గా కణాలలో మారుతుంది ,వైరల్ ఆర్ఎన్ఏ పాలిమరేస్ దీనిని సబ్‌స్ట్రాట్‌గా గుర్తిస్తుంది. తద్వారా ఆర్ఎన్ఏ పాలిమెరాజ్ చర్యను నిరోధిస్తుంది.తేలికపాటి నుంచి మోస్తరు లక్షలణాలను కలిగి ఉన్న చాలామంది రోగులు ఫాబీఫ్లూ వినియోగం ద్వారా ప్రయోజనం పొందగలరు. ఈ ఔషదాన్ని ప్రిస్క్రిప్షన్ ఆధారిత ఔషదంగా టాబ్లెట్‌కు 103 రూపాయల ధరలో అందిస్తారు. మొదటి రోజు 1800ఎంజీ టాబ్లెట్‌ను రోజుకు రెండుసార్లు వేసుకుంటే, అనుసరించి 800ఎంజీ టాబ్లెట్లను రోజుకు రెండుసార్లు చొప్పున 14 రోజులు వేసుకోవాల్సి ఉంటుందని సూచించడమైనది.
గత నెలారంభంలో గ్లెన్‌మార్క్, తాము మరో క్లీనికల్ ట్రయల్‌ను రెండు యాంటీవైరల్స్ ఫావిపిరావిర్ మరియు యుమీఫెనోవిర్ల ను కాంబినేషన్ థెరఫీగా వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను మోస్తరు స్థాయి లక్షణాలు కలిగి హాస్పిటల్లో చేరిన భారతదేశంలోని కోవిడ్-19 రోగులపై చేస్తున్నట్లు వెల్లడించింది.