Sat. Nov 23rd, 2024


365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 30 ,హైదరాబాద్: సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌ మురుగదాస్‌ల ఫ‌స్ట్ క్రేజి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `దర్బార్`.  లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  రజిని ఆదిత్య అరుణాచలం గా  ప‌వ‌ర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా  నటిస్తున్న‌ సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఎ.ఆర్‌.మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించిన ప్ర‌ముఖ నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి తెలుగులో విడుద‌ల చేస్తున్నారు.  ఇప్ప‌టికే విడుదలైన పోస్టర్స్ కి, టీజర్ కి  ప్రపంచ వ్యాప్తంగా ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. కాగా లేటెస్ట్ గా ` దర్బార్` తెలుగు ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్.

 ట్రైలర్ చాలా రిచ్‌గా ఉండి తలైవా ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అన్ని  ఉన్నాయి..వాడు పోలీస్ ఆఫీసరా సార్.. హంతకుడు అనే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. ఆదిత్య అరుణాచలం, కమిషనర్ ఆఫ్ పోలీస్ ముంబై గా రజని ఎంట్రీ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉంది. ఆఫీసర్స్ పోలీస్ ఈజ్ నాట్ ఏ జాబ్..వుయ్ లీవ్ టు ప్రొటెక్ట్..వుయ్ డై టు సర్వ్ అని రజిని చెప్పే డైలాగ్, సార్ వాళ్లకి చెప్పండి.. పోలీసుల‌ దగ్గరికి  లెఫ్ట్‌లో రావొచ్చు, రైట్‌లో రావచ్చు.. స్ట్రయిట్‌గా రావద్దని.. ఆ చూపేంటి ఒరిజిన‌ల్‌గానే నేను విల‌నమ్మా .. ఇక ట్రైలర్ చివర్లో ‘ఐ యామ్ ఏ బ్యాడ్ కాప్’ అని పాడుకుంటూ రజనీ తన స్టైల్‌లో నడుచుకుంటూ రావడం అదిరిపోయింది. సునీల్ శెట్టి విల‌నిజం ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంది.  సంతోష్ శివన్ విజువల్స్, లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. న‌య‌న‌తార  గ్లామ‌ర్ లుక్‌తో మెప్పిస్తుంది. ట్రైలర్ చూస్తుంటే ‘దర్బార్’  సినిమా రజనీకాంత్ వన్ మ్యాన్ షోలా ఉండబోతున్నట్లు అర్థం అవుతుంది. మొత్తానికి ఈ ట్రైలర్  సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

రజినీకాంత్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నివేత థామస్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది, సునీల్ శెట్టి, తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు  నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: స‌ంతోష్ శివ‌న్‌, మ్యూజిక్: అనిరుద్ ర‌వి చంద్ర‌న్, ఎడిట‌ర్: శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్, నిర్మాత: ఎ.సుభాస్కరన్, ద‌ర్శ‌క‌త్వం: ఎ.ఆర్. మురుగదాస్‌

error: Content is protected !!