Fri. Jan 3rd, 2025

365తెలుగు డాట్ కామ్ , ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 12: నల్ల ద్రాక్షలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది వ్యాధి నిరోధకతను పెంచడంలో సహాయం చేస్తుంది. అంతేకాదు శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నల్లద్రాక్ష తో ప్రయోజనాలు
.ద్రాక్ష రసంను క్రమంతప్పకుండా తీసుకోవడం వలన గుండె పోటును నివారించుకోవచ్చు.

  • తరచూ ఈ పండ్లు తీసుకోవడం వల్ల ఏకాగ్రత కుదరడమే కాదు.. జ్ఞాపకశక్తీ మెరుగవుతుంది. వీటిల్లో ప్రత్యేకంగా ఉండే పాలీఫెనాల్‌ మైగ్రెయిన్‌ తలనొప్పినీ, మతిమరుపును అదుపులో ఉంచి.. మెదడు పనితీరును చురుగ్గా మారుస్తుంది.

-నల్లద్రాక్షలో ఉండే ఫైటోకెమికల్స్‌ గుండెలో పేరుకొనే చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి అక్కడి కండరాలకు మేలుచేస్తాయి. అలా హృద్రోగాలను దూరంచేస్తాయి. ఈ ద్రాక్షలోని పోషకాలు క్యాన్సర్‌ కారకాలతో పోరాడుతాయి కూడా.

  • బరువు తగ్గాలనుకునేవారు ఈ పండ్లను ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను తొలగించి, బరువు తగ్గించేందుకు ఉపకరిస్తాయి.
    . ద్రాక్ష రసం త్రాగడం వలన హై బీపి అదుపులో ఉంటుంది.
  • ద్రాక్ష రసంలో పంచదార కలపకుండా త్రాగడం వలన తలనొప్పి తగ్గుతుంది. ద్రాక్ష రసాన్ని తరచూ తీసుకోవడం వలన మెటబాలిజం రేటు పెరుగుతుంది.
  • ద్రాక్షలో విటమిన్ కె మరియు పొటాషియం అధికంగా ఉండటం వలన చర్మం పొడిబారకుండా చేసి చర్మానికి మంచి నిగారింపును ఇస్తుంది.

-అసిడిటితో బాధపడేవారు రోజూ ఒక గ్లాసు తాజా ద్రాక్షా రసం తాగడం వలన అసిడిటి తగ్గుముఖం పడుతుంది.

-ద్రాక్షలో సెల్యులోజ్, ఆర్గానిక్ ఆసిడ్ మరియు షుగర్ వంటివి మలబద్ధకాన్ని నివారించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అందువల్ల మలబద్దకంతో బాధపడేవారు ద్రాక్షను తినడం వల్ల చాలా మేలు జరగుతుంది.

-జీవం కోల్పోయిన జుట్టుకు ద్రాక్ష గింజలు చక్కని ఔషధంలా పనిచేస్తాయి. వాటిల్లోని ఫ్యాటీ ఆమ్లాలు శిరోజాలకు పోషణను అందించి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి.

  • మధుమేహం ఉన్నవారు ద్రాక్ష తీసుకోకూడదని చెబుతారు. కానీ నల్లద్రాక్షకు రక్తంలోని చక్కెరస్థాయుల్ని అదుపులో ఉంచే శక్తి ఉంది. అలాగే రక్తసరఫరా సజావుగా సాగేలా చేసి అధికరక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతుందని చెబుతున్నారు నిపుణులు.
error: Content is protected !!