365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్,28,2020:బంగారం ధరలు ఈ వారం భారీ పెరుగుదలతో ప్రారంభమయ్యాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(ఎమ్ సీఎక్స్)లో గతవారం 10 గ్రాముల ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.50064.00 వద్ద, ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.50198.00 వద్ద ముగిసింది . ఈ రోజు (సోమవారం 28) ప్రారంభ సెషన్‌లోనే దాదాపు రూ.450 వరకు ఎగిసింది. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక ప్యాకేజీపై సంతకం చేసిన నేపథ్యంలో పసిడి ధరలపై ఒత్తిడి పెరిగింది. దీంతో అంతర్జాతీయ, జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధరలు కాస్త పెరిగాయి.బంగారం రూ.430 ఎగసి బంగారం ధరలు నేడు ప్రారంభ సెషన్ లో ఈ రోజు రూ.433.00 (0.86%) పెరిగి రూ.50506.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,200.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.50,530.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,200.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.421.00 (0.84%) పెరిగి రూ.50550.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,500.00 వద్ద ప్రారంభమై, రూ.50,550.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,471.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
సిల్వర్ రూ.2000 వెండి ఏకంగా రూ.2000 పెరిగింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి రూ.2,028.00 (3.00%) ఎగిసి రూ.69537.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,000.00 వద్ద ప్రారంభమై, రూ.69,800.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,000.00 వద్ద కనిష్టాన్ని తాకింది. గత వారం మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.67518.00 వద్ద ముగిసింది . ఇప్పుడు రూ.69వేలు దాటి రూ.70వేల దిశగా సాగుతోంది. మార్చి ఫ్యూచర్స్ (మే) రూ.2,004.00 (2.93%) పెరిగి రూ.70326.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,413.00 వద్ద ప్రారంభమై, రూ.70,543.00 వద్ద గరిష్టాన్ని, రూ.70,326.00 వద్ద కనిష్టాన్ని తాకింది.అక్కడ 1900 డాలర్ల దిశగా… అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1900 డాలర్ల దిశగా సాగుతోంది. ఈ సమయంలో ఈ స్థాయిని కూడా దాటింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 15.85 (+0.84%) డాలర్లు పెరిగి 1,899.05 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 1,885.80 – 1,904.05 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 22.93 శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ ఔన్స్ 0.927 (+3.58%) డాలర్లు పెరిగి 26.835 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.085 – 26.973 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 47.65% పెరిగింది.