Sat. Dec 21st, 2024

365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 17, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 66వ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు కెసిఆర్ కు ట్వీట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన ట్వీట్టర్ వేదికగా సిఎం కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కెసిఆర్‌ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నానని మోడీ ట్వీట్ చేశారు. మంత్రి కెటిఆర్ కూడా తన తండ్రి, సిఎం కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తల్లిని కన్న తనయుడికి జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. అలాగే ఎపి సిఎం జగన్ తోపాటు ఎపి మాజీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్టర్ ద్వారా ముఖ్యమంత్రి కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్య జీవితాన్ని ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా సిఎం కెసిఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని టిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున మొక్కలు నాటుతూ హరితహారంలో పాల్గొంటున్నారు.

error: Content is protected !!