Heritage Foods contributes Rs 1 crore to the Nation towards fight against COVID 19 pandemic

365 తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, మార్చి21 హైదరాబాద్: కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజా ఆరోగ్యం కోసం మెరుగైన సేవలందించడానికి సిధ్దమైంది హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ సంస్థ. ఉద్యోగులు, వినియోగదారుల శ్రేయస్సు కోసం భద్రతా చర్యలను అమలు చేస్తున్నది.
 

నాణ్యమైన ఉత్పత్తులను వినియోగదారులకు అందించడానికి హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ భద్రతా పరమైన జాగ్రత్తలు చేపడుతున్నది. కార్పొరేట్ కంపెనీలతోపాటు ఇతర కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పిస్తున్నారు. హెరిటేజ్ ఫుడ్స్  ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం నాణ్యత కలిగిన పాలు , పాల ఉత్పత్తులను కొనసాగిస్తున్నామని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ఓ ప్రకటనలో తెలిపారు. తమ సంస్థ కు  చెందిన అన్ని ప్రాసెసింగ్ ప్లాంట్లలో తగిన భద్రతా చర్యలు తీసుకున్నామని ఆమె పేర్కొన్నారు. ప్లాంట్‌లోకి ప్రవేశించే ముందు వాహన సిబ్బందితోపాటు వివినియోగదారులకు సెక్యూరిటీ గేట్ వద్ద థర్మల్ స్కానర్ ద్వారా  తక్షణ వైద్య పరీక్షలు చేస్తున్నామని బ్రాహ్మణి వివరించారు. కరోనా వైరస్ పై పోరాడటానికి అవసరమైన ఉత్పత్తులు అందిస్తున్నట్లు చెప్పారు. హోమ్ డెలివరీ , ఇ-కామర్స్ మార్గాల ద్వారా హెరిటేజ్ పాలు  ,పాల ఉత్పత్తులను నిరంతరాయంగా సరఫరా చేస్తామని, తమ ఇంటి నుండి బయటకు రావాల్సిన అవసరం లేకుండానే వినియోగదారులు హెరిటేజ్ ఉత్పత్తులను అందుకోవచ్చని ఆమె వివరించారు.