Thu. Nov 21st, 2024
GG-hospital-ramnagar_365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 12,2023: ఈ రోజుల్లో సాధారణ జలుబు లేదా జ్వరంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే కన్సల్టేషన్ ఫీజే రూ. 300 నుంచి500 వరకు ఉంటుంది. అంతేకాదు దీనికి అదనంగా, మందుల ఖర్చు మరింత భారంగా మారుతోంది.

అలాంటి పరిస్థితుల్లో నిరుపేదలైతే ఆ వైద్యానికి దూరమవ్వాల్సివస్తోంది. అటువంటి అభాగ్యులకు సహాయం చేయాలనే లక్ష్యంతో రామ్ నగర్‌లో గంగయ్య గారి (జిజి) ఛారిటబుల్ హాస్పిటల్‌ మెరుగైన వైద్యం అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఇక్కడి ఆసుపత్రికి వచ్చిన వారికి కేవలం ఒక్కరూపాయికే చికిత్స చేస్తున్నారు.

GG-hospital-ramnagar_365

మందులు కూడా 40 శాతం రాయితీ..

ఆర్థోపెడిక్, గైనకాలజీ, పీడియాట్రిక్, జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్ , డెర్మటాలజీకి వేర్వేరు విభాగాలు ఉన్నాయి. ఆసుపత్రిలో 50 పడకలు ఉన్నాయి. వీటితో పాటు రక్త, మూత్ర పరీక్షలు నిర్వహిస్తారు. అల్ట్రాసౌండ్ , ఎక్స్-రే యూనిట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

అంతేకాదు ఇక్కడ మరో విశేషం ఏమిటంటే..? అన్నిరకాల వైద్య పరీక్షలకు డయాగ్నోస్టిక్ సెంటర్‌లో 50 శాతం మాత్రమే వసూలు చేస్తున్నారు. టెస్టుల్లోనేకాకుండా ,మందులు కూడా 40 శాతం రాయితీ ఇస్తారు.

ఆసుపత్రి 24 గంటలూ..

ఆసుపత్రి 24 గంటలూ పనిచేస్తోంది. ప్రస్తుతం ఔట్ పేషెంట్ వార్డు మాత్రమే పనిచేస్తోంది, అతి త్వరలో ఇన్ పేషెంట్ వార్డు ప్రారంభం కానుంది. రోగులకు రెండు షిఫ్టుల్లో నాణ్యమైన వైద్యం అందించేందుకు 18 మంది వైద్యులు, 30 మంది నర్సులు ఇక్కడ పనిచేస్తున్నారు. రోజూ 1800 నుంచి 2000 మంది రోగులు వైద్యం కోసం ఆసుపత్రికి వస్తుంటారు.

GG-hospital-ramnagar_365

“కోవిడ్ సమయంలో, సరైన చికిత్స లభించక చాలా మంది ప్రజలు బాధపడటం, చాలా మంది ప్రాణాలు కోల్పోవడం నేను చూశాను, దీనికి ప్రధాన కారణం ప్రైవేట్ ఆసుపత్రులలో రోగులకు కన్సల్టేషన్ ఫీజులు,

మందులు, రక్త పరీక్షలు, స్కానింగ్,ఎక్స్-రేలు వంటి ఇతర ఖర్చుల కోసం భారీ మొత్తాన్ని చెల్లించలేనివారికి అతితక్కువ ధరలో మెరుగైన చికిత్స అందించాలనే లక్ష్యంతో, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఆసుపత్రిని నిర్మించాం.- ఛైర్మన్ గంగాధర్ గుప్తా,జీజీ ఛారిటబుల్ హాస్పిటల్ వ్యవస్థాపకుడు.

ఆసుపత్రి ఆవరణలో ఒక పెట్టె ఏర్పాటు చేశారు. కన్సల్టేషన్ ఫీజు కోసం రూపాయి అక్కడి పెట్టెలో వేయాల్సి ఉంటుంది. ఎవరైనా రూ.1 కంటే ఎక్కువ విరాళం ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చు. ఇలా సేకరించిన మొత్తాన్ని ఆసుపత్రి అభివృద్ధికి ఖర్చు చేస్తారు. ఒకవేళ ఆ రూపాయికూడా ఇవ్వలేనివారికి కూడా ఉచితంగా చికిత్స పొందవచ్చు.

చికిత్సతో పాటు రోగులతో వచ్చిన వారికీ ఉచితంగాభోజనం అందిస్తారు. ప్రస్తుతం ఔట్ పేషెంట్ వార్డు మాత్రమే పనిచేస్తోంది, అతి త్వరలో ఇన్ పేషెంట్ వార్డు ప్రారంభమవుతుంది.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాకా మరింతమందికి చికిత్స అందించనున్నట్లు ఆసుపత్రి నిర్వాహకులు చెబుతున్నారు.

GG-hospital-ramnagar_365

ఎవరైనా రూ. 2000 చెల్లించి, ఆసుపత్రి భవనం, నాల్గవ అంతస్తులో ఏదైనా శుభకార్యాలు జరుపుకోవచ్చు. ఇలా దానం చేసిన దాతలు మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవచ్చు. అందులో సంవత్సరానికి ఒకసారి 59 పరీక్షలు ఉచితంగా అందిస్తారు.

ఆసుపత్రి ఏర్పాటు ఎలాజరిగిందంటే..? మొదట తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఖమ్మంలో ఛారిటబుల్ ద్వారా ఫ్రీ గా ట్రీట్మెంట్ చేశారు.

అనంతరం నగరంలో బోయిన్‌పల్లి, ఉప్పల్‌తో పాటు ఉచితంగా చికిత్స అందించేందుకు ఆసుపత్రిని ప్రారంభించడానికి ఆసక్తి ఉన్న కొంత మంది డాక్టర్లు ముందుకురావడంతో వాళ్లంతా కలిసి జీజీ ఆసుపత్రిలో ఫ్రీగా వైద్యం చేస్తున్నారు.

error: Content is protected !!