Sun. Dec 22nd, 2024
THE-TRILIGHT_365telugu

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,ఫిబ్రవరి 4, 2023: లగ్జరీ హై రైజ్‌ రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌ ద ట్రిలైట్‌ను హైదరాబాద్‌లోని గోల్డెన్‌ మైల్‌, కోకాపేట వద్ద ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో డైరెక్టర్లు సంజయ్‌ గులాబానీ, అమిత్‌ గులాబానీ, జక్కిరెడ్డి సంజీవ్‌ రెడ్డి, జక్కిరెడ్డి సుభాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు.

ట్రిలైట్‌ లగ్జరీ రెసిడెన్స్‌లలో మూడు టవర్లు ఉంటాయి. ఇవి 56 , 46 ,49 ఫ్లోర్లు పొడవు ఉంటాయి. ఇవి నివాసితులకు ప్రపంచ శ్రేణి జీవన శ్రేణి అనుభవాలను అందిస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు.

ట్రిలైట్‌లో మొట్టమొదటిసారిగా మూడు క్లబ్‌ హౌస్‌లు విభిన్న లెవల్స్‌లో ఉంటాయి. ఈ లగ్జరీ గేటెడ్‌ కమ్యూనిటీలో గ్రౌండ్‌ నుంచి 6వ అంతస్తు వరకూ వైట్‌ గ్లోవ్స్‌,14 నుంచి 16 ఫ్లోర్ల వరకూ అప్‌ అండ్‌ ఎబౌవ్‌, 47 అండ్ 48 ఫ్లోర్‌లలో థౌజండ్స్‌ ఆఫ్‌ స్టార్స్‌ ఉంటాయి.

THE-TRILIGHT_365telugu

అలాగే 47వ ఫ్లోర్‌లో ఇన్ఫినిటీ పూల్‌-సెంట్రల్‌ కోర్డ్‌ యార్డ్‌ ఉంటుంది. ఇక్కడ అత్యాధునిక ఫిట్‌నెస్‌ సెంటర్‌, కబానాలు, లాంజ్‌, గోల్ఫ్‌ సిమ్యులేటర్‌జోన్‌, టెన్నిస్‌ కోర్ట్‌, గ్రాండ్‌ బాంక్విట్స్‌, గెస్ట్‌ కోసం సర్వీస్‌ రూమ్స్‌, బహుళ టెర్రాస్‌ గార్డెన్లు ఉంటాయి.

ట్రిలైట్‌ డెవలపర్స్‌ అయిన డీ బ్లూ ఓక్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అండ్ పీ మంగతరామ్‌ డెవలపర్స్‌ నిబద్ధతకు నిదర్శనం. నివాసితులకు అత్యుత్తమ జీవన అనుభవాలను అందించాలనే వీరి ప్రయత్నాలను ట్రిలైట్‌ ప్రతిబింబిస్తుంది. ఈ డెవలప్‌మెంట్‌ను అత్యున్నత ప్రమాణాలతో ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌ టాటా ప్రాజెక్ట్స్‌ నిర్మిస్తుంది.

‘‘ట్రిలైట్‌ను ఆవిష్కరిస్తుండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. నివాసితులకు లగ్జరీ జీవనాన్ని అత్యుత్తమంగా అందిస్తున్నాము’’ అని సంజయ్‌ గులాబనీ, డైరెక్టర్‌-పీ మంగత్‌రామ్‌ డెవలపర్స్‌ అన్నారు. ‘

‘ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలుపుతున్నాను. ట్రిలైట్‌లోకి నూతన నివాసితులను త్వరలోనే స్వాగతించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని అన్నారు.

డీ బ్లూ ఓక్‌ కన్‌స్ట్రక్షన్స్‌ డైరెక్టర్‌ సంజీవ రెడ్డి మాట్లాడుతూ ‘‘కేవలం ఎలివేషన్‌ మాత్రమే ఆకర్షణీయంగా ఉండటం మాత్రమే కాదు, ఈ హై రైజ్‌ అపార్ట్‌మెంట్‌ల అంతర్గత బలం, డిటైలింగ్‌ సైతం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటాయి. వినియోగదారులు పూర్తి మనశ్శాంతితో ద ట్రిలైట్‌లో నివసించవచ్చు’’అన్నారు.

error: Content is protected !!