365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, మే 22,హైదరాబాద్ 2020 : లాక్‌డౌన్ వేళ ఇంటిల్లిపాదికీ వినోద వేదికగా నిలిచిన స్టార్ మా పిల్లల కోసం అవెంజర్స్, లయన్ కింగ్ లాంటి చిత్రాలతో పాటుగా కిండర్‌ల్యాండ్ఇస్మార్ట్ జోడీ జర్నీ, బిగ్ లాక్‌డౌన్ ఛాలెంజ్‌తో యువతకు కిక్కుమహిళామణుల కోసం కార్తీకదీపం, కోయిలమ్మ లాంటి సీరియల్స్ పునః ప్రసారంపెద్దవారి కోసం పురాణగాథలు, సీరియళ్లు లాక్‌డౌన్ ప్రతి ఒక్కరికీ కష్టాలనే తీసుకువచ్చింది. ఎన్నో రంగాలు కుదేలయ్యాయి. వినోదరంగం అందుకు మినహాయింపేమీ కాదు. ఇంటిల్లిపాదికీ సంతోషాన్ని అందించే టీవీ పరిశ్రమ సంగతి చెప్పేదేముంది ? మహిళామణులకు ఎంతో ప్రీతిపాత్రమైన కార్తీకదీపం, కోయిలమ్మ లాంటి సీరియల్స్ షూటింగ్‌లకు బ్రేక్‌పడింది. అవొక్కటే కాదు పిల్లలు, పెద్దలను ఆకట్టుకునే రసవత్తరమైన కార్యక్రమాలు కూడా ఆగిపోయాయి. అయితే స్టార్ మా మాత్రం తమదైన శైలిలో వినూత్నమైన కార్యక్రమాలను ప్రసారం చేసి లాక్‌డౌన్ వేళ కుటుంబమంతటికీ ఇష్టమైన ఛానెల్‌గా నిలిచింది. ఇంటిలో ఉండండి… సురక్షితంగా ఉండండి అంటూనే వినోదాన్నీ పొందండి అంటూ తమ కార్యక్రమాల ద్వారా ఆకట్టుకుంది.
తెలుగు బ్లాక్‌బస్టర్ చిత్రాల ప్రీమియర్లు మొదలు అంతర్జాతీయంగా బ్లాక్ బస్టర్ చిత్రాలైనటువంటి అవెంజర్స్ ఎండ్‌గేమ్ వరకూ ఎక్కువ మంది వీక్షించడానికి ఇష్టపడే తెలుగు ఫిక్షన్ షోస్ మొదలు; ప్రత్యేకంగా తీర్చిదిద్దిన నాన్ ఫిక్షన్‌ను ప్రైమ్‌టైమ్‌లో ప్రసారం చేయడం వరకూ , ఉదయం పూట పురాణాలు మొదలు పిల్లల కోసం కిండర్‌ల్యాండ్ అంటూ ప్రత్యేకంగా తీర్చిదిద్దన కార్యక్రమాల వరకూ విభిన్న కార్యక్రమాలతో స్టార్‌మా కుటుంబంలో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.
ఈ వేసవిలో తనకిష్టమైన అవెంజర్స్, లయన్‌కింగ్ లాంటి సినిమాలెన్నో చూశానని ఆరవ తరగతి విద్యార్థి అన్సూల్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ‘లయన్ కింగ్’ సినిమాను మా ఫాదర్‌తో కలిసి థియేటర్లలో అప్పట్లో రెండుసార్లు చూశాను. కానీ టీవీలో చూడటం మాత్రం ఇంకా సూపర్‌గా ఉందన్నాడు. ఇక ఈ లాక్‌డౌన్ కాలంలో ప్రజలకు అస్సలు బోర్ కొట్టకుండా, సృజనాత్మక మార్గాలను ఛానెల్ అనుసరించింది.
లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లకు అనుమతి లేకపోవడంతో మొబైల్ ఫోన్‌తో ఇంటిలోనే ఆసక్తికరమైన షోస్‌ను చిత్రించింది. అలాంటి వాటిలో ‘ఇస్మార్ట్‌జోడీ జర్నీ’ ఒకటి. టెలివిజన్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జూమ్‌కాల్‌ను వినియోగించుకుని ఇస్మార్ట్ జోడిని రూపొందించిన యాంకర్ ఓంకార్ అయితే కష్టసాధ్యమే అయినప్పటికీ ఆకట్టుకునేలా తారల జీవిత ప్రయాణాన్ని అందంగా తెరకెక్కించగలిగామన్నారు. ఇదే తరహా సెలబ్రిటీ కార్యక్రమం ‘బిగ్ లాక్‌డౌన్ ఛాలెంజ్’. ఇది ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుందనడానికి సోషల్‌మీడియాలో వీక్షకుల నుంచి వచ్చిన కామెంట్లే నిదర్శనం. బిగ్‌లాక్‌డౌన్ ఛాలెంజ్ కార్యక్రమం తననెంతో ఆకట్టుకుందని 32 సంవత్సరాల గృహిణి వాసంతి చెబుతూ తానెప్పుడూ సినీ, టీవీ తారల జీవితాలను దగ్గరగా చూడాలని కోరుకునేదానినని, ఈ లాక్‌డౌన్ వేళ స్టార్ మా ఆ కొరత తీర్చిందన్నారు. ఇంటిలో మా అభిమాన తారలేమి చేస్తున్నారు, వారి జీవనశైలి ఎలాగుంటుందో తెలుసుకునే వీలు మాకు చిక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. అభిమానుల ఈ సంతోషమే ‘మా ప్రయత్నం మన కోసం’ అనే ఛానెల్ ప్రయత్నాలు విజయవంతమయ్యాయనడానికి నిదర్శనం.