365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,ఏప్రిల్ 9,న్యూఢిల్లీ,2020 : భారతదేశంలో అత్యంత కీలకమైన తొమ్మిది గృహ మార్కెట్‌లలో విలాసవంతమైన గృహాలకు డిమాండ్ ఇప్పటికీ స్థబ్తుగానే ఉంది. గత మూడేళ్లలో ప్రారంభించిన ఈ తరహా గృహాలలో సగానికి పైగా యూనిట్లు అమ్ముడుకాకుండా ఉన్నాయి . అని ప్రాప్ టైగర్ డాట్ కామ్ వద్ద నున్న సమాచారం తెలుపుతుంది. హౌసింగ్ డాట్ కామ్, మకాన్ డాట్ కామ్ లాంటి పోర్టల్స్ సహా ఇలారా టెక్నాలజీస్ లో భాగమైన రియల్ ఎస్టేట్ పోర్టల్ ప్రాప్‌టైగర్ వద్ద లభ్యమవుతున్నగణాంకాలు వెల్లడించే దాని ప్రకారం 7 కోట్ల రూపాయలకు పై బడి విలువ కలిగిన1131 హౌసింగ్ యూనిట్లును 2016 డిసెంబర్ ,2019 డిసెంబర్ మధ్య మూడేళ్ల కాలంలో ప్రారంభించారు. వీటిలో 577 యూనిట్లు అంటే 51% యూనిట్లు జనవరి 2020 నాటికి కూడా అమ్ముడుకాలేదు. అదే రీతిలో, 5 కోట్ల రూపాయల నుంచి 7 కోట్ల రూపాయల విలువ కలిగిన 3656 యూనిట్లును ఈ మార్కెట్‌లలో గత మూడేళ్ల కాలంలో ఆవిష్కరించారు. కానీ వీటిలో దాదాపు 55% యూనిట్లు ఇంకా విక్రయించబడలేదు. అదనంగా, మూడు కోట్ల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల విలువ కలిగిన 8,503 యూనిట్లను ఈ మూడేళ్ల కాలంలో ప్రారంభించారు కానీ వీటిలో దాదాపు 56% యూనిట్లు అమ్ముడుకాలేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
విలాసం వేచి చూస్తుంది.ధరలు మార్చి 2020 నాటికి 9 మార్కెట్‌లలో అమ్ముడుకాకుండా ఉన్న గృహ యూనిట్లు
1-3 కోట్ల రూపాయలు 51,997 యూనిట్లు
3-5 కోట్ల రూపాయలు 4,762 యూనిట్లు
5-7 కోట్ల రూపాయలు 2,025 యూనిట్లు
7 కోట్ల రూపాయలకు పైన 577 యూనిట్లు
ఖచ్చితమైన సంఖ్యల పరంగా చూస్తే, ఆర్థిక రాజధాని ముంబైలో అత్యధికంగా విక్రయించబడని విలాసవంతమైన గృహాలు ఉన్నాయి (30,015) . దీనిని అనుసరించి భారతదేశపు ఫార్మాస్యూటికల్ రాజధాని హైదరాబాద్ (8,554) భారతదేశపు సిలికాన్‌వ్యాలీ, బెంగళూరు (5,794) ఉన్నాయి. 2017లో కనిపించిన సంఖ్యలతో సరిపోల్చినప్పుడు తొమ్మిది కీలకమైన మార్కెట్‌లలోనూ చాలా వరకూ ధరల బ్రాకెట్‌లో నూతన లగ్జరీ విభాగపు గృహాల ఆవిష్కరణలో క్షీణత కనిపించింది. ఉదాహరణకు 1-3 కోట్ల రూపాయల ధర కలిగిన యూనిట్ల పరంగా చూస్తే 2018లో 29,996 యూనిట్లు ప్రారంభిస్తే 2019లో వాటి సంఖ్య 29,775 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. అలాగే 5-7 కోట్ల రూపాయల ధరల యూనిట్లలో 2018లో 1536 యూనిట్లు ప్రారంభిస్తే గత సంవత్సరం కేవలం 859 యూనిట్లు మాత్రమే ఆవిష్కరించారు. అదే రీతిలో 7 కోట్ల రూపాయలకు పైబడిన విలువ కలిగిన యూనిట్ల పరంగా 2018లో 542 యూనిట్లు ఆవిష్కరిస్తే, 2019లో మొత్తం 9 మార్కెట్‌లలోనూ కలిపి కేవలం 34 యూనిట్లను మాత్రమే ప్రారంభించారు. 3-5 కోట్ల రూపాయల ధరల నడుమ యూనిట్ల పరంగా మాత్రం ఆవిష్కరణలు కాస్త పెరిగాయి. 2019వ సంవత్సరంలో 3092 యూనిట్లను ఆవిష్కరిస్తే 2018లో
వాటి సంఖ్య 2675 యూనిట్లు మాత్రమే .”భారతదేశంలో రియల్ ఎస్టేట్ ఇప్పుడు అసాధారణ ఒత్తిడిని ప్రస్తుత మందగమనంలో ఎదుర్కొంటుంది. ఇది లగ్జరీ హౌసింగ్ విభాగంతో పాటుగా గృహ రియల్ ఎస్టేట్ విభాగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. నోట్ల రద్దు తరువాత విలాసవంతమైన గృహాలకు డిమాండ్ గణనీయంగా పడిపోయింది. ఆ తరువాత ధోరణిలో పెద్దగా మార్పురాలేదు. కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తుండటంతో 2021 ఆర్థిక సంవత్సరం మొదటి అర్థభాగంలో లగ్జరీ హౌసింగ్ సహా రియల్ ఎస్టేట్ రంగం పరంగా గణనీయమైన ప్రభావం పడే అవకాశాలున్నాయి…”అని ధృవ్ అగర్వాల, గ్రూప్ సీఈవో, హౌసింగ్ డాట్ కామ్, మకాన్ డాట్ కామ్ , ప్రాప్ టైగర్ డాట్ కామ్ అన్నారు. భారతీయ రూపాయి క్షీణత కొనసాగితే మాత్రం భారతీయ లగ్జరీ హౌసింగ్ విభాగంలో ఎన్ఆర్ఐ వినియోగదారుల ఆసక్తి పెరిగే అవకాశాలు వృద్ధి చెందే అవకాశాలున్నాయని అగర్వాలా అంచనా వేశారు. “యుఎస్ డాలర్‌తో పోల్చినప్పుడు ఇటీవలి కాలంలో భారతీయ రూపాయి 77 రూపాయలకు పైన పడిపోయింది. ఇది ఎన్ఆర్ఐ గృహ కొనుగోలుదారులకు ప్రయోజనకారిగా నిలిచింది. గతంతో పోలిస్తే ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన పెట్టుబడిగా ఈ లగ్జరీ గృహాల కొనుగోలు నిలుస్తుంది” అని అగర్వాలా అన్నారు.
ఈ విశ్లేషణలో భాగమైన నగరాలలో అహ్మదాబాద్ (గాంధీ నగర్ సహా), బెంగళూరు , చెన్నై, గురుగ్రామ్ (భివాండీ, ధారుహెరా, సోహ్నా సహా), హైదరాబాద్, కోల్‌కతా, ముంబై (నవీ ముంబై మరియు థానె సహా), పూనె, నోయిడా (గ్రేటర్ నోయిడా, నోయిడా ఎక్స్‌టెన్షన్,యమునా ఎక్స్‌ప్రెస్‌వే సహా ) ఉన్నాయి.