365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, విశాఖపట్నం, ఫిబ్రవరి 17,2020:: కలింగ వారసుడు జగదీష్ దానేటి కలింగ వార్ చిత్రాన్ని నిర్మించాలని తలపెట్టడం తన పురిటిగడ్డ కలింగ సీమ రుణం తీర్చుకోవడమేనని శరదాపీఠ వ్యవస్థాపకులు శ్రీ స్వరూపనందేంద్ర సరస్వతి కొనియాడారు. విశాఖపట్నంలోని శారదా పీఠం లో హాలీవుడ్ చిత్రబృందం స్వామిజీని కలిసింది. ఈ సందర్భంగా ఆయన జగదీష్ దానేటికి రాజ ఖడ్గం ను బహూకరించి ఆశీర్వచనం అందించారు.

ప్రపంచ దేశాలలో హింస పెచ్చురిల్లుతున్న ఈ తరుణంలో అశోక చక్రవర్తి శాంతి భీజాలు నాటిన కలింగ యుద్ధం ఒక హాళివుడ్ చిత్రంగా తీయాలనుకోవడం సుభసూచకమని అన్నారు. కలింగ వార్ చిత్రం ద్వార ప్రపంచ దేశాలకు అహింస, శాంతి సందేషాలను అందించాలనే ఆలొచన అభినందనీయమని ఆయన దర్శకుడు జగదీష్ ని కొనియాడారు. ఈ చిత్ర ఉద్దేశ్యం తనకు బాగ నచ్చిందని స్వామీజి చెప్పారు.

భరతదేశంలో జరిగిన కలింగ యుద్ధం నేఫద్యముగా చిత్రం తీయాలని హలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ – పింక్ జాగ్వర్స్ ఎంటర్టైన్మెంట్ ముందుకు రావడం తనకు ఎంతో సంతొషం కలిగించిందని స్వామీజి అన్నారు.స్వామీజిని కలిసినవారిలో పింక్ జాగ్వర్స్ ఎంటర్టైన్మెంట్ మేనెజింగ్ డైరెక్టర్ సువర్ణ పప్పు, హలీవుడ్ దర్శకుడు, నిర్మాత జాని మార్టిన్, హలీవుడ్ నటి లిలిన్ రావ్ లు ఉన్నారు. ఒక మంచి లక్షంతో చిత్రనిర్మానానికి పూనుకున్నందుకు ఈ భ్రుందాన్ని స్వామి స్వరూపనందేంద్ర సరస్వతి అభినందించి, యజ్ఞంలా తలపెట్టిన ఈ కలింగ వార్ చిత్రం విజయవంతం కావలని వారందరిని ఆశీర్వదించారు.
