Thu. Dec 26th, 2024
In Telangana, Hyderabad records the highest consumption of entertainment with 90% viewership: Disney+Hotstar

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 28,హైదరాబాద్ :వీడియో వినియోగం పరంగా వేగంగా మారుతున్న వీక్షకుల సెంటిమెంట్స్‌, అభివృద్ధి చెందుతున్న ఆన్‌లైన్‌ వినోదరంగానికి గణనీయంగా తోడ్పడుతున్నాయి. దీనికితోడు, మహమ్మారి కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ కారణం చేత ఆన్‌లైన్‌ కంటెంట్‌ కు ఆదరణ కూడా పెరిగింది. ఈ వృద్ధి ఆలంబనగా ,దక్షిణ భారతదేశంలో మారుతున్న వీక్షకుల వినియోగ ప్రవర్తనలను అర్ధం చేసుకోవడంలో భాగంగా డిస్నీ+ హాట్‌స్టార్‌ ఇటీవలనే తెలంగాణాలో ఓ అధ్యయనం నిర్వహించింది.

In Telangana, Hyderabad records the highest consumption of entertainment with 90% viewership: Disney+Hotstar
In Telangana, Hyderabad records the highest consumption of entertainment with 90% viewership: Disney+Hotstar

ఈ అధ్యయనం కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలను వెల్లడించింది. తెలంగాణాలో, వినోద వినియోగ పరంగా హైదరాబాద్‌ నగరం 90% వాటాతో నేతృత్వం వహించింది.  ఈ ప్లాట్‌ఫామ్‌పై వీక్షకుల సంఖ్య పరంగా మెట్రోయేతర నగరాలలో 117% వృద్ధి కనిపించింది. ఈ నివేదికలోనే రియాల్టీ , నాటకీయత కలిగిన షోలను వీక్షించడానికి ఇతర జెనర్స్‌తో పోలిస్తే అధికశాతం మంది ఆసక్తి చూపుతున్నారని వెల్లడైంది.

తెలంగాణా రాష్ట్రంలో అత్యధికశాతం మంది వీక్షిస్తోన్న షోగా బిగ్‌బాస్‌ తెలుగు నిలిచింది. ఆసక్తికరంగా, గత సీజన్‌ వీక్షకుల సంఖ్యను సీజన్‌ 4 వీక్షకుల సంఖ్య అధికగమించడమే కాదు, వినియోగపరంగా గత సీజన్‌తో పోలిస్తే 60% వృద్ధి నమోదైంది. ఈ అధ్యయనంవెల్లడించే దాని ప్రకారం తెలంగాణాలో సీజన్‌4 వీక్షకులలో 40% మంది మహిళలే ఉండటం గమనార్హం.

Disney+ Hotstar brings exciting drama and action from Bigg Boss Tamil  Season 4! – Hot News Express

అదనంగా, ఈ స్ట్రీమింగ్‌  ప్లాట్‌ఫామ్‌ తమ వీక్షకులకు వినూత్నమైన అవకాశాన్ని సైతం అందించింది. కేవలం షో వీక్షణం మాత్రమే కాదు, ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఒక్కరోజులో 10సార్లు ఓటు చేసే అవకాశం కూడా అందించింది. తద్వారా తమ అభిమాన పోటీదారులు హౌస్‌లో ఉండేలా అసాధారణ గేమ్‌ చేంజర్స్‌గానూ వీక్షకులు నిలిచారు. డిస్నీ+ హాట్‌స్టార్‌ వినియోగదారుల అనుసంధానత పరంగా రెండు రెట్ల వృద్ధిని ఈ ప్లాట్‌ఫామ్‌పై 2019లో వోటింగ్‌ను పరిచయం చేసిన తరువాత నమోదు చేసింది. ఈ సంవత్సరం కూడా అది కొనసాగింది.

ఈ షో వీక్షకులు డిస్నీ+హాట్‌స్టార్‌ యాప్‌ను తమ మొబైల్‌ ఫోన్స్‌(ఆండ్రాయిడ్‌ , ఐఓఎస్‌పై లభ్యం)పై డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసి అనంతరం తమ ఈ–మెయిల్‌ ఐడీ, ఫోన్‌ నెంబర్‌ లేదా సోషల్‌మీడియా ఖాతా ఉపయోగించుకుని ఖాతా తెరువాల్సి ఉంటుంది. అనంతరం బిగ్‌బాస్‌ తెలుగు4 అని సెర్చ్‌బార్‌లో వెదికి అక్కడ ఓట్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేయడం ద్వారా తమ అభిమాన పోటీదారునికి ఓటు చేసి కాపాడవచ్చు. ప్రతి రోజూ వినియోగదారులకు 10 ఓట్లు ఉంటాయి. వీటిని ఒకే పోటీదారునికి లేదా జాబితాలోని ఇతర పోటీదారులకు కూడా కేటాయించడం చేయవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా, వీక్షకులకు ఇంటరాక్ట్‌ కావడంతో పాటుగా తమ అభిమాన పోటీదారుల కోసం ఓటు చేస్తూ తమ అభిప్రాయాలను సైతం వెల్లడిచేసే అవకాశం కలుగుతుంది. అంతేకాదు, గత సంవత్సరంతో పోల్చినప్పుడు బిగ్‌బాస్‌ సీజన్‌ 4 లో ఆడవారితో పోలిస్తే మగవారే ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొన్నారు.

ఈ అధ్యయనం గురించి డిస్నీ+హాట్‌స్టార్‌ అధికార ప్రతినిధి మాట్లాడుతూ‘‘ దక్షిణ భారతదేశంలోని వీక్షకుల నుంచి వచ్చిన స్పందన పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాము. మెట్రో నగరాలతో పాటుగా ఆన్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంటెంట్‌ వినియోగమనేది చిన్న నగరాలలో కూడా  గణనీయంగా పెరిగింది. ఓటీటీ వేదికలకు తరువాత దశ వృద్ధికి ఇది తోడ్పడుతుందని అంచనా. మాకు అత్యంత కీలకమైన మార్కెట్‌గా దక్షిణభారతదేశపు మార్కెట్‌ నిలుస్తుంటుంది. మా ప్రాంతీయ కంటెంట్‌ లైబ్రరీని వృద్ధి చేసుకోవడం ద్వారా మరియు అధిక నాణ్యత కంటెంట్‌ను ఉచితంగా అందించడం ద్వారా మేము మా వీక్షలకులతో అన్ని సన్నిహితంగా ఉండటం కొనసాగించనున్నాము’’ అని అన్నారు.

హైదరాబాద్‌ తరువాత, రెండవ స్థానంలో విశాఖపట్నం షో వీక్షణ పరంగా 20% వీక్షకులతో నిలిచింది. ఈ అధ్యయనంలో వెల్లడైన అంశాల ప్రకారం బిగ్‌బాస్‌ తెలుగు ప్రాచుర్యం కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాలేదు. మహారాష్ట్రలో ఉంటున్న వారు కూడా ఈ షోను అధికంగానే వీక్షించారు. తెలుగు రాష్ట్రాలకు వెలుపల అత్యధిక వీక్షణం ముంబైలోనే కనిపించింది. అంతేకాదు, ఆసక్తికరంగా, ప్రతి ఇద్దరి వీక్షకులలో ఒకరు తమ అభిమాన కంటెస్టెంట్‌కు ఈ ప్లాట్‌ఫామ్‌పై ఓటు చేశారు.

In Telangana, Hyderabad records the highest consumption of entertainment with 90% viewership: Disney+Hotstar
In Telangana, Hyderabad records the highest consumption of entertainment with 90% viewership: Disney+Hotstar

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌4తో పాటుగా డిస్నీ+హాట్‌స్టార్‌ యొక్క అత్యున్నత నాణ్యత కలిగిన కంటెంట్‌ లైబ్రరీలో రోజువారీ సీరియల్స్‌ను అధికంగా చూశారు. ఎనిమిది భారతీయ భాషలలో విస్తృతస్థాయి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలతో కూడిన కలెక్షన్స్‌ ఉన్నాయి. వీటితోపాటుగా ప్రత్యక్ష ప్రసారాలు, ఎనిమిది భాషలలో ఆన్‌డిమాండ్‌ న్యూస్‌ను భారతదేశంలో అగ్రశ్రేణి వార్తా చానెల్స్‌ నుంచి వీక్షించడంతో పాటుగా సమగ్రమైన క్రీడా క్లిప్స్‌ సైతం ఉన్నాయి. వీటిలో అతి ప్రధానమైన స్పోర్టింగ్‌ కార్యక్రమాలైనటువంటి ఐపీఎల్‌, బీసీసీఐ క్రికెట్‌ సిరీస్‌, ప్రీమియర్‌ లీగ్‌, ఐఎస్‌ఎల్‌,  పీకెఎల్‌ వంటివి ఉన్నాయి. వీటితో పాటుగా ఉత్సాహపూరితమైన యాక్షన్‌ను మ్యాచ్‌ హైలైట్స్‌ నుంచి, కీలకమైన వ్యక్తిగత ప్రదర్శనలు, మ్యాచ్‌ విశ్లేషణలు సైతం పొందవచ్చు.

error: Content is protected !!