Thu. Oct 3rd, 2024

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి13,హైదరాబాద్: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమావేశాల్లో భాగంగా సోమవారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం లో సీనియర్ తెరాస నాయకులు, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి జక్క వెంకట్ రెడ్డి అధ్యక్షత వహించారు.

ఇందులోభాగంగా కార్పొరేటర్ అభ్యర్థులను పరిచయం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎన్నికల ఇంచార్జ్ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జరగనున్నఎన్నికల్లో అందరూ సమన్వయంతో ప్రజల్లోకి వెళ్లాలని, అన్ని స్థానాల్లో టీఆరెస్ పార్టీ జెండా ఎగురవేయాలని, అందుకోసం పక్కా ప్రణాళికతో ముందుకు పోవాలని సూచించారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని భారీ మెజారిటీతో కైవసం చేకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.

error: Content is protected !!