Sun. Sep 8th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 16,2024 : ఇస్లాం మతంలో రంజాన్ మాసం పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఐతే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకుమాత్రమే ఉపవాసం ఉంటారు. ఖర్జూరం తిని ఉపవాస దీక్ష విరమించే సంప్రదాయం ఉంది.

ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం రంజాన్ మాసం తొమ్మిదో నెల. ఈ నెల మొత్తం ముస్లింలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు.

మార్చి 12, మంగళవారం నుంచి భారతదేశంలో రంజాన్ ప్రారంభమై, ఏప్రిల్ 10 బుధవారంతో ముగుస్తుంది.

ఉపవాసం ప్రాముఖ్యత..

రంజాన్‌లో ఉపవాసాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఉపవాసం ఉండేవారు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఒక నెల మొత్తం ఉపవాసం ఉంటారు.

ఈ కాలంలో ప్రతి రాత్రి నమాజ్ చేస్తారు. ఇఫ్తార్ సమయంలో వివిధ రకాల వంటకాలు తినే ముందు ఉపవాస దీక్ష విరమిస్తారు. పవిత్రమైన రంజాన్ మాసం మంచి పనులు చేయాలని అంటారు.

ఈ సమయంలో ఇస్లాంలు ఎక్కువ సమయం అల్లాను ఆరాధించడంలో గడుపుతారు. రంజాన్ మాసంలో నియమాల ప్రకారం ఉపవాసం ఉండి, నిజమైన హృదయంతో అల్లాను ప్రార్థించే వ్యక్తి, అతని ప్రార్థనలను అంగీకరించి అతని పాపాలన్నీ క్షమించబడతాయని ముస్లిం మత గ్రంథాలలో నమ్ముతారు.

అందుకే ఖర్జూరం తినేది..

రంజాన్‌లో ఖర్జూరం తినడం ద్వారా ఉపవాసం విరమించడం సున్నత్‌గా పరిగణిస్తారు. ఇస్లామిక్ విశ్వాసాల ప్రకారం, ఖర్జూరాలు ప్రవక్త హజ్రత్ మొహమ్మద్ బాగా ఇష్టమైన పండు.

ఖర్జూరం తిని ఉపవాసం కూడా విరమించేవాడని నమ్ముతారు. అందువల్ల, ముస్లింలు కూడా తమ ఉపవాసాన్ని విరమించుకోవడానికి మొదట ఖర్జూరాన్ని తింటారు. ఆ తర్వాత ఇతర ఆహారపదార్థాలు తింటారు.

ఆరోగ్యానికి ప్రయోజనకరం..

ఖర్జూరం తిని ఉపవాసం విరమించడమనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ఉపవాసం ఉన్న వ్యక్తి రోజంతా ఉపవాసం ఉన్న తర్వాత ఖర్జూరం తినడం ద్వారా ఉపవాసం విరమిస్తే, తక్షణ శక్తి లభిస్తుంది.

ఖర్జూరం శరీరంలో హైడ్రేషన్‌ను మెయింటెయిన్ చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి ఉపవాసానికి ముందు,తర్వాత ఖర్జూరం తినడం మంచిదని భావిస్తారు.

error: Content is protected !!