365తెలుగు డాట్ కామ్ , ఆన్ లైన్ న్యూస్ ,విజయవాడ, జూన్ 12,2020: : జీతం కోసం కాకుండా నిజాయితీగా… వృత్తి కోసం పని చేసే ప్రతి జర్నలిస్ట్ కు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తామని ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. గత ప్రభుత్వం మాదిరి ఆశ చూపకుండా అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్ట్ కు నివేశన స్థలం ఇస్తామని ఆయన చెప్పారు.
త్వరలోనే అటువంటి జర్నలిస్టులందరికీ త్వరలో తీపికబురు చెప్పనున్నట్లు , వ్యాపారాలు, పైరవీలు, సెక్రటేరియట్, ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయించుకోవడం కోసం, బస్, ట్రైన్ పాస్ ల కోసం దొంగ కార్డులతో జర్నలిస్ట్ లను ఏరివేత చర్యలు చేపట్టామని, గౌరవంతో పని చేసే జర్నలిస్ట్ లందరినీ గుర్తిస్తామని ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్నినాని అన్నారు.