365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 28,హైదరాబాద్: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా ఎన్నికయిన జక్క వెంకటరెడ్డి తోపాటు ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ లు టీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను తెలంగాణ భవన్ లో మర్యాద పూర్వకంగా కలిసారు.
ఈ సందర్బంగా కేటీఆర్ గెలుపొందిన కార్పొరేటర్లందరికి శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను బడుగు, బలహీన వర్గాలకు అందజేస్తున్న సంక్షేమ కార్యమాలను ప్రతి ఒక్కరికి అందేవిదంగా చూడాలన్నారు. కార్పొరేషన్ అభివృద్ధిలో అందరూ భాగస్వాములై దేశంలోనే ఉత్తమ మున్సిపల్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దేలా సమిష్టి కృషితో ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.