Wed. May 1st, 2024
క‌రోనాను కనిపెట్టే ట్రాకింగ్ యాప్‌ 'ఆరోగ్య సేతు'

365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,ఏప్రిల్ 3,నేషనల్ : భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తిపై ప్ర‌జ‌ల‌కు అవగాహన కల్పించడానికి ప్రత్యేక దృష్టి సారించింది మోదీ సర్కారు. అందులో భాగంగా కోవిద్-19 మహమ్మారి సోకిన వ్యక్తులను కనిపెట్టి, అప్రమత్తమయ్యేలా కేంద్రం ఓ అప్లికేషన్ ను రూపొందించింది. అటువంటి కేసులను సమర్థవంతంగా ట్రాక్ చేసేందుకు “ఆరోగ్య సేతు” పేరుతో సరికొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

క‌రోనాను కనిపెట్టే ట్రాకింగ్ యాప్‌ 'ఆరోగ్య సేతు'
క‌రోనాను కనిపెట్టే ట్రాకింగ్ యాప్‌ ‘ఆరోగ్య సేతు’

నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ అప్లికేషన్ ను అభివృద్ధి చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐ ఫోన్ లలో గూగుల్ ప్లే స్టార్ ద్వారా ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫోన్ లో దీనిని ఇన్ స్టాల్ చేసుకొని జీపీఎస్ సిస్టం ద్వారాగానీ బ్లూ టూత్ ను ఉపయోగించడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని ట్రాక్ చేయడం లో సహకరిస్తుంది. అంతేకాదు కరోనా ఉన్నదో లేదో కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ దగ్గరలో ఈ వైరస్ సోకినా వ్యక్తి ఉంటే హెచ్చరిస్తుంది. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ తో “ఆరోగ్య సేతు” యాప్ ను తయారు చేశారు. 11 భాషల్లో ఇది అందుబాటులో ఉన్నది.