Mon. Dec 23rd, 2024

365తెలుగు డాట్ కాం ఆన్ లైన్ న్యూస్, జులై 20 , హైదరాబాద్: ఈ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సభలో ప్రవేశపెట్టారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభలో బిల్లుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. చర్చ జరిగిన అనంతరం తెలంగాణ మున్సిపల్ చట్టం -2019 బిల్లును సభ ఆమోదించింది. 
-తెలంగాణ మున్సిపల్ చట్టం ద్వారా పూర్తి పారదర్శకత.-అవినీతి రహిత పాలన కోసమే నూతన మున్సిపల్ చట్టం.-ప్రజలకు మేలు చేసేలా కొత్త చట్టం రూపకల్పన.-75 గజాల లోపు ఇంటి నిర్మాణానికి రిజిస్ట్రేషన్ ఫీజు రూపాయి మాత్రమే.-75 గజాల లోపు నిర్మించుకున్న ఇంటికి పన్ను రూ. 100-కార్యాలయానికి రాకుండానే 500 చదరపు మీటర్ల వరకు నిర్మాణాలకు అనుమతి.-500 చదరపు మీటర్ల వరకు నిర్ణీత సమయంలో ఆన్‌లైన్‌లోనే అనుమతి.-యజమానులే ఇంటి నిర్మాణానికి సంబంధించి సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇవ్వాలి.-ఇంటి కొలతలు, ఇతర తప్పుడు సమాచారం ఇస్తే భారీగా జరిమానాలు.-తప్పుగా సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇస్తే 25 రెట్ల జరిమానా.-అక్రమ నిర్మాణాలు చేపడితే నోటీసు ఇవ్వకుండానే కూల్చివేత. 
-పట్టణాలు, పల్లెల్లోనూ గ్రీన్ కవర్ పాలసీ.-కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రీన్ కమిటీ ఏర్పాటు.-హరితహారం లక్ష్యాలపై అశ్రద్ధ చేసే అధికారులు ఉద్యోగాల నుంచి తొలగింపు.-బాధ్యతలు నిర్వర్తించని ప్రజాప్రతినిధులపై చర్యలు-మొక్కలు నాటి సంరక్షించని సర్పంచ్, చైర్‌పర్సన్‌ల పదవులు తొలగింపు.-కొత్త చట్టం ద్వారా అధికారులు, ఉద్యోగులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా బదిలీ చేసే అధికారం.-కొత్త చట్టంలో మరింత కీలకంగా జిల్లా కలెక్టర్ల పాత్ర.

error: Content is protected !!