Tue. Apr 30th, 2024

365telugu.com ఆన్‌లైన్ న్యూస్, జూన్ 27, హైదరాబాద్: ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూశారు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె..కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా ఆమె సూపర్ స్టార్ కృష్ణ భార్య అనే విషయం తెలిసిందే. 1946 ఫిబ్రవరి 20న జన్మించిన విజయనిర్మల..అత్యధిక చిత్రాల్లో క‌ృష్ణ పక్కనే హీరోయిన్‌గా నటించారు. వీరిద్దరూ కలిసి 50 సినిమాల్లో జంటగా నటించారు. ప్రపంచంలోనే ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా..ఆమె గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు. రఘుపతి వెంకయ్య అవార్డును కూడా అందుకున్నారు. 11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో నటిగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన విజయ నిర్మల..రంగుల రాట్నం చిత్రంతో హీరోయిన్ పరిచయం అయ్యారు. విజయనిర్మల పుట్టినిల్లు నరసరావుపేట. విజయనిర్మల తల్లి శకుంత, అన్నలు వసంతరావు, సంజీవరావు పాతూరులో వీరి కుటుంబాలన్నీ నివాసం ఉండేవి. విజయనిర్మల బాల్యం అత్యధిక కాలం పాతూరులోనే గడిచిపోయింది. రాజాగారి కోటలోని విక్టోరియా హాల్లో ఆమె చిన్నతనంలో నృత్య ప్రదర్శన కూడా ఇచ్చింది. కొద్ది కాలం తర్వాత విజయనిర్మల తల్లిదండ్రులతో కలిసి మద్రాస్‌ వెళ్లిపోయారు. 7 ఏళ్ల వయసు ఉన్నప్పడు పాండురంగ మహత్యంలో బాలనటిగా చిత్రరంగంలో ప్రవేశించారు. బాలనటిగా ఉన్నప్పుడు సినిమాల్లో ఎక్కువగా మగవేషాలు వేశారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి కథానాయకిగా ఉన్నతస్థానానికి చేరారు. తరువాత దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిసుబుక్‌లో ఎక్కారు. ఆమె అసలు పేరు నిర్మల .. తనకి మొదటి అవకాశం ఇచ్చిన విజయ స్టూడియోస్ కి కృతజ్ఞతగా ఆమె పేరును విజయనిర్మలగా మార్చుకున్నారు.

విజయనిర్మల నటిగానే కాకుండా దర్శకురాలుగా కూడా మెప్పించారు.. మొత్తం నలబై నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు… దర్శకురాలుగా ఆమె మొదటగా మీనా అనే సినిమాకి దర్శకత్వం వహించారు.. చివరగా ఆమె 2009 లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా వచ్చిన నేరము- శిక్ష సినిమాకి దర్శకత్వం వహించారు.. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆమెని 2008 లో రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్‌ రాబర్ట్‌ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, లంకె బిందెలు, కలెక్టర్‌ విజయ, ప్రజల మనిషి, మొగుడు పెళ్లాల దొంగాట, పుట్టింటి గౌరవం, లాంటి ఎన్నో మంచి సినిమాలకు ఆమె దర్శకత్వం వహించారు.. తమిళ్ స్టార్ శివ గణేష్ న్ ను డైరెక్ట్ చేసిన మహిళ దర్శకురాలు విజయనిర్మల కావడం విశేషం… ఆమె కృష్ణమూర్తి అనే వ్యక్తిని వివాహం చేసుకొని ఆ తరవాత కృష్ణని రెండవ వివాహం చేసుకున్నారు.. ప్రముఖ హీరో నరేష్ ఆమెకి ఉన్న ఏకైక సంతానం… ఆమె మృతితో సినీ నటులు కన్నీటి పర్యంతమయ్యారు..