365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్,హైదరాబాద్, 20ఆగష్టు 2020 : మెరిట్ ఆధారంగా వైద్య కళాశాలలో ప్రవేశానికి అర్హత సాధించినప్పటికీ కుటుంబ ఆదాయం తక్కువగా ఉన్న కారణంగా వైద్య విద్యను అందుకోలేని పేద విద్యార్దులకు జూలై 2న స్వర్గస్థులైన ప్రముఖ వైద్యులు,హెచ్‌ఇఎస్ సొసైటీ వ్యవస్థాపకులు డా॥ కె.వి.ఆర్. ప్రసాద్ గారి జ్ఞాపకార్ధం ‘‘డా॥ కె.వి.ఆర్. ప్రసాద్ మెమోరీయల్ అవార్డ్’’ను అందజేయనున్నట్లుగా హెచ్‌ఇఎస్ సొసైటీ ప్రకటించింది. వైద్య విద్య అందుకునే నాలుగు సంవత్సరాల ఫీజును సొసైటీ పూర్తిగా భరిస్తుంది. ఎన్‌ఇఇటి యూజి ద్వారా తెలంగాణలోని ఏదేని ప్రభుత్వ కళాశాలలో ఎమ్‌బిబిఎస్ సీటును మెరిట్‌తో సాధించి,సంవత్సరానికి లక్ష రూపాయలు అంతకంటే తక్కువ కుటుంబ ఆదాయం కలిగిన అర్హులైన అభ్యర్దులు ఇక్కడ తెలిపిన లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు http://hessociety.org/drkvrprasad/
కె.వి.ఆర్. ప్రసాద్ గురించి:డా॥ కె.వి.ఆర్.ప్రసాద్ నగరంలో సీనియర్ ఫిజిషియన్‌గా, ప్రముఖ వైద్యులుగా పేరుప్రఖ్యాతులు సంపాదించారు. సికంద్రాబాద్‌లోని సీతాఫల్ మండీలో ఐదు దశాబ్దాల క్రితం శ్రీదేవి నర్సింగ్‌హోమ్ పేరుతో ఒక నర్సింగ్ హోమ్‌ను స్థాపించి, తన చివరి శ్వాస వరకు సమాజానికి విశేష సేవలతో తన జీవితాన్ని అంకితం చేశారు. శ్రీదేవి నర్సింగ్ హోమ్ పేద ప్రజలకు వైద్య సేవలు అందించే హాస్పిటల్‌గా ప్రసిద్దిచెంది ఈ నాటికి కూడా ఆ ప్రాంతానికి అది ఒక ల్యాండ్‌మార్క్‌గా నిలిచింది. ఆయన అందించిన మానవీయ వైద్య సంరక్షణతో తరాలకు చెందిన రోగులు లబ్ది పొందారు.
హెచ్‌ఇఎస్ సొసైటీ గురించి:విద్య, క్రీడా రంగాలో రాణించిన అర్హత కలిగిన వ్యక్తలకు,సరైన వైద్య సహాయం అవసరమై కూడా పేదరికంతో అందుకోలేనివారికి సహాయపడేందుకు, మార్గనిర్దేశం చేసేందుకు డా॥ కె.వి.ఆర్.ప్రసాద్ గారి కుటుంబ సభ్యులచే హెచ్‌ఇఎస్ సొసైటీ స్థాపించబడిరది. లాక్‌డౌన్ కాలంలో సొసైటీ ఆధ్వర్యంలో వంద కుటుంబాలకు పైగా నిత్యావసర సరుకులను అందించడం జరిగింది. కుటుంబ సభ్యులు,డా॥ కె. హరి ప్రసాద్ రచించిన ఐయామ్ పాసిబుల్ పుస్తకం అమ్మకాల ద్వారా సొసైటీకి ప్రస్తుతం అవసరమైన నిధులను సమకూర్చడం జరుగుతున్నది. విరాళాలు అందించేందుకు లేదా సొసైటీ కార్యకలాపాలలో పాలు పంచుకోవడంలో ఆసక్తి కలిగిన వలంటీర్లు దయచేసి సందర్శించండి info@hessociety.org.