365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్, మేడ్చల్,19 ఆగష్టు 2020:అల్ ఇండియా కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ సంస్థ మధ్యప్రదేశ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ వినియోగదారుల సౌలభ్యం కోసం వారి హక్కుల కోసం పనిచేస్తుంది. AICPO వారు ఈ పాటికే రాష్ట్రాల వారిగా రాష్ట్ర అధ్యక్షులను నియామకం చేసింది. తెలంగాణ రాష్ట్రానికి సంబందించి Dr. బాలాజీ బక్వాడ్ గారు AICPO స్టేట్ ప్రెసిడెంట్ గా నియామకం అవ్వగా బాలాజీ గారి ఆద్వర్యంలో మన తెలంగాణ రాష్ట్రంలో, మేడ్చల్ జిల్లాకు సంబంధించి AICPO జిల్లా అధ్యక్షునిగా శ్రీరామ్ శివకుమార్ ను ఈరోజు నియామకం చేశారు. ఈ సందర్భంగ శ్రీరామ్ శివకుమార్ మాట్లాడుతూ వినియోగదారులకు సంబంధించిన సమస్యలను తాను ముందుండి పోరాడుతానని మేడ్చల్ జిల్లా అధ్యక్షునిగా తనకి భాద్యతలు ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షులు Dr బాలాజీ గారికి ధన్యవాదాలు తెలియజేసారు.