365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 5,2022: అనంతపు రం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల మధ్య వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి.వర్షాల నేపథ్యంలో గుత్తి నుంచి బళ్లారి వెళ్తుండగా దొనేకల్ వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. బస్సు నీటిలో ఉన్నప్పుడు లోపల 30 మంది ప్రయాణికులు ఉన్నారు.
అయితే బస్సు నదిలో కూరుకుపోయిన బస్సును అక్కడి స్థానికులు వెంటనే అప్రమత్తమై ట్రాక్టర్ సహాయంతో బస్సును బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు అనంతపురం జిల్లాలోని ఉరవకొండ, విడపనకల్లు, బెళుగుప్ప మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది.

భారీ వర్షాల కారణంగా స్థానిక నదులు పొంగిపొర్లుతున్నాయి. దోనేకల్, రాయంపల్లి, ఉండబండ, ఆర్.కొట్టాల వాగులు పొంగిపొర్లడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.